Harish Rao: హరీశ్ రావు పార్టీ మారుతున్నారా.. ఈ వార్తలో నిజమెంత..!

తెలంగాణలో బీఆర్ఎస్ క్రమంగా ప్రభావం కోల్పోతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కేసీఆర్ తర్వాత గట్టి పట్టున్న నేత హరీశ్ రావు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే హరీశ్ రావు పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. లేదు కాంగ్రెస్ లోకి వెళ్తారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై హరీశ్ రావు స్పందించారు. కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. అలా చేయడం వల్ల నేతలు ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టకు, పార్టీకి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే లీగల్ గా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Siddipet MLA Harish Rao reacted to the news of the party changing

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి హరీశ్ రావు ఇవ్వాలని డిమాండ్ ఉంది. హరీశ్ రావు అయితేనే పార్టీని ముందుకు తీసుకెళ్తారని చాలా మంది భావిస్తున్నారు. ఒకప్పుడు కేటీఆర్ సీఎం కావాలన్న వారు కూడా ఇప్పుడు హరీశ్ రావు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కాగా హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గ్రూప్-1, గ్రప్-2 అభ్యర్థులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా అసరా ఫించన్లు పెంచలేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోగానే ఆసరా పించన్లన ఆగిపోయాయయని ఏప్రిల్, మే నెలల ఆసరా పింఛన్లు ఖాతాల్లో జమ చేయలన్నారు. పక్క రాష్ట్రంలో పెంచన్లు పెంచుతామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు అధికారంలోకి రాగానే పెంచన్లను పెంచుతూ సంతకం పెట్టారని హరీశ్ గుర్తు చేశారు. కొత్త పించన్లతో పాటు పాత బకాయిలు కలిపి పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+