'దృశ్యం-3' సినిమా చూపించాడు భయ్యా.. వీడు సినిమాల్లోకి పోతే..

మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తున్నాయి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు. డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని అనడానికి ఈ ఘటనలు ఉదాహరణగా చెప్పచ్చు. డబ్బు కోసం సొంత మనుషులను సైతం హతమార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేసిన అల్లుడు అత్తను దారుణంగా చంపించాడు.

డబ్బు కోసం అత్తను చంపేయాలని ప్లాన్ వేశాడు. ఆమె మరణిస్తే ఇన్సురెన్స్ డబ్బు వస్తుందని ఆశ పడ్డాడు. అలా సొంత అత్తనే కిరాతకంగా చంపించాడు. పైగా ఆమె హత్యను హిట్ అండ్ రన్‌ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కపూర్ దర్గా వద్ద జరిగింది. వెంకటేశ్ అనే వ్యక్తి.. అత్త ఇన్సూరెన్సు డబ్బు కోసం రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీ కొట్టించి ఆమెను కిరాతకంగా చంపించాడు. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను లేపేసిన వెంకటేశ్ హిట్ అండ్ రన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లుడు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Siddipet Shocker Son-in-Law Kills Mother-in-Law for Insurance Inspired by Drishyam 2

ఏం జరిగిందంటే..?

ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రామమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. రామమ్మ అల్లుడు తాళ్ల వెంకటేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మొదట హిట్ అండ్ రన్ గానే అనుకున్నారు. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో మహీంద్ర థార్ వాహనం కనిపించింది. ఆ వాహనమే రామమ్మను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ మేరకు కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేశ్ సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులకు రామమ్మ అల్లుడు వెంకటేశ్ పై అనుమానం కలిగింది. వెంటనే స్టేషన్ కు పిలిపించి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం చెప్పాడు. రామమ్మని తానే హత్య చేయించినట్టు వెంకటేశ్ ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చంపించానని చెప్పుకొచ్చాడు.

గతంలో వెంకటేశ్ పౌల్ట్రీ బిజినెస్ చేసి రూ. 22 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో పాటు సోదరుడు కరుణాకర్‌ కు అప్పుగా లక్షా 30 వేల రూపాయలు ఇచ్చాడు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆర్థిక నష్టం నుంచి బయట పడాలని ప్లాన్ వేశాడు వెంకటేశ్. ఈ క్రమంలో వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేయాలని ప్లాన్ వేశాడు.

అప్పటికే రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అంతేకాక ఆమె చనిపోతే మరో రూ. 5 లక్షల రూపాయలు రైతు బీమా వస్తాయని ఆలోచించి తన పేరుపై ఉన్న భూమిని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈక్రమంలో రామమ్మను చంపాలని ప్లాన్ వేసిన వెంకటేష్.. కరుణాకర్‌ ను పిలిచి తన ప్లాన్ చెప్పాడు. అత్తని హత్య చేస్తే తన అప్పు తీర్చాల్సిన అవసరం లేదని ఒప్పించాడు. అంతేకాక అత్త ఇన్సూరెన్స్ డబ్బులో ఇద్దరం చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఈ ప్లాన్ కు ఒకే చెప్పాడు. అలా రామమ్మను కారుతో ఢీ కొట్టించి హత్య చేశారు. హిట్ అండ్ రన్ కింద ప్రచారం చేశారు.

కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు వెంకటేశ్. ఇక పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు ముందుగానే పోస్టాఫీసు, ఎస్బీఐ ఇన్సూరెన్సు, రైతు బీమా చేయించినట్లు గుర్తించారు. మహీంద్రా థార్ కార్ ను అద్దెకు తీసుకొని హత్యకు ప్లాన్ చేశామని.. దృశ్యం 2 సినిమా చూసి మర్డర్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+