బాకీ కోసం వచ్చి వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
హైదరాబాద్: వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన హైద్రాబాద్ షాపూర్‌నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకొంది. అయితే తాగిన మైకంలో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించిన భార్య భాగోతం వెలుగు చూసింది.
అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకొన్న భర్తను కాదని వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తలను హత్య చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.
అయితే భర్తను ప్రియుడి సహయంతో హత్య చేసిన భార్య మద్యం మత్తులోనే చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, భర్త మృతదేహంపై గాయాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. దీంతో భార్యను నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.

బాకీ కోసం వచ్చి వివాహేతర సంబంధం
విజయనగరం జిల్లా వంగర మండలం గీతనపల్లి గ్రామానికి చెందిన బంటుపల్లి సింహచలం, విజయ దంపతులు పదకొండేళ్ళ క్రితం జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చారు. హైద్రాబాద్ కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బొంతలు కుట్టి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కుటుంబ పోషణకు జయరాంనగర్ కు చెందిన గౌరినాయుడు వద్ద సింహచలం అప్పులు చేసేవాడు.ఈ అప్పు వసూలు చేసుకొనేందుకు గౌరినాయుడు సింహచలం ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సింహచలం భార్యతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్నాడు.

భర్త వివాహేతర సంబంధం పసిగట్టిన భర్త
గౌరినాయుడుకు తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని సింహచలం గుర్తించాడు.ఈ విషయమై భార్యతో తరచూ గొడవకు దిగేవాడు.గౌరి నాయుడుతో తన భార్య వివాహేతర సంబంధం మానుకోలేదు. అయితే తమ మధ్య సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ప్రియుడితో హత్య చేయించాలని ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు.

భార్యతో గొడవపడిన సింహచలం
మార్చి 16వ తేది రాత్రి వివాహేతర సంబంధం విషయమై భార్యతో సింహచలం గొడవపెట్టుకొన్నాడు. ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో చిన్న కొడుకు, సింహచలం భార్య ఒక గదిలో పడుకొన్నారు.మరో గదిలో పెద్దకొడుకు పడుకొన్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున సింహచలం ఇంటి ముందు మెట్ల మీద అచేతనంగా పడి ఉన్నాడు. అదే సమయంలో గౌరినాయుడు ఇంటి వెనుక వైపున ఉన్న మెట్లపై నుండి పక్కింట్లోకి పారిపోవడాన్ని సింహచలం భార్య, కొడుకులు గమనించారు.

హత్యగా గుర్తించిన పోలీసులు
మద్యం మత్తులో మెట్లపై నుండి జారిపడి సింహచలం మరణించాడని ఆయన భార్య బంధువులను నమ్మించింది. అంత్యక్రియల సందర్భంగా మృతుడి ఒంటిపై ఉన్న గాయాలను గుర్తించారు.ఈ విషయమై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సింహచలం భార్యను ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పింది. అయితే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సింహచలం భార్య, ప్రియుడు గౌరి నాయుడు హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications