డీజీపీ రవి గుప్తాకు సింగపూర్ ఎయిర్ లైన్స్ రూ. 2 లక్షల నష్ట పరిహారం: ఎందుకంటే?
హైదరాబాద్: వినియోగదారులకు సరైన సేవలు అందించనందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ డీజీపీ, ఆయన భార్యకు కలిపి రూ.2లక్షలు చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్‌ను ఆదేశించింది. గతడాది(2023) మే 23న రవిగుప్తా ఆయన భార్య అంజలి గుప్తాతో కలిసి హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు.
ఈ క్రమంలోనే వారికి ప్రయాణంలో అసౌకర్యం కలగడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొందామని తెలంగాణ డీజీపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. సంబంధిత సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని డీజీపీ, ఆయన భార్యకు చెల్లించాలని సంబంధిత సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్‌ను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే..
20233, మే 23న రవిగుప్తా తన భార్య అంజలి గుప్తాతో కలిసి హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకు బిజినెస్ క్లాస్‌లో రిక్లైనర్ సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ప్రయాణ సమయంలో రిక్లైనర్ సీట్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ విఫలమవడం వల్ల ప్రయాణ సమయమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని.. బిజినెస్ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డీజీపీ రవిగుప్తా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
బిజినెస్ క్లాస్ ఒక్కో టికెట్ ధర రూ. 66,750గా ఉంది. దీంతో డీజీపీతో పాటు ఆయన భార్యకు కలిగిన అసౌకర్యానికి గాను ఇద్దరికీ కలిపి రూ.97,500పాటు 2023 మే నుంచి 12 శాతం వడ్డీ అందజేయాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు రవిగుప్తా, ఆయన భార్యకు ఒక్కో లక్ష చొప్పున మొత్తంగా 2 లక్షలు, ఫిర్యాదు చేసేందుకు అయిన ఖర్చులకు గాను 10వేలు ఇవ్వాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.












Click it and Unblock the Notifications