రాష్ట్రంలో SIR గడువు పెంపు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

రాష్ట్రంలో SIR గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తితో గడువు పొడిగించింది. దీంతో క్లెయిమ్ లు, అభ్యంతరాల స్వీకరణ కోసం అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు నవంబర్ 9 న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నారు. ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ ను ఈసీ విడుదల చేసింది.

అందులోని వివరాల ప్రకారం పీరియడ్ ఫర్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఇప్పుడున్న షెడ్యూల్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు తేదీని అక్టోబర్ 10 వరకు పెంచారు. అలాగే నోటీస్ ఫేజ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వివరాలు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉండగా ఆ తేదీలను నవంబర్ 5 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫైనల్ పబ్లికేషన్ వివరాలు అక్టోబర్ 19 న ఉండగా ఆ తేదీని నవంబర్ 9 వరకూ పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

SIR Extended In Telangana Extension of SIR deadline in the state Election Commission key decision

గతంలో పొడిగించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16 తో ముగియాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరింత సమయం కావాలని సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు రాశారు. అయితే వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణలోకి తీసుకుంది ఎన్నికల సంఘం. ఈ మేరకు గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకునేవారికి అలాగే జాబితాలో తప్పులను సరిదిద్దుకోవాలని అనుకునేవారికి అదనపు సమయం దొరికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+