స్టూడియోలో శిరీష-రాజీవ్ భార్యాభర్తల్లా.., విస్తుపోయే నిజాలు.. షాక్‌లో భర్త!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించిన అనంతరం ఆమె భర్త, తండ్రి స్పందించారు. వారు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తమ ఆవేదన వెళ్లగక్కారు.

చదవండి: రాజీవ్‌కు సంబంధం చూసిన శిరీష

ప్రెస్ మీట్లో కమిషనర్ వెల్లడించిన వివరాలపై వారు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష కేసులో తమకు ఎలాంటి న్యాయం జరగేదని వారు వాపోయారు.

జీర్ణించుకోలేని ముద్ర వేశారు

జీర్ణించుకోలేని ముద్ర వేశారు

కమిషనర్ ప్రెస్ మీట్ తర్వాత ఆవేదనకు గురయ్యానని శిరీష తండ్రి చెప్పారు. తమకు న్యాయం కావాలన్నారు. వారు తమ కూతురుపై జీర్ణించుకోలేని ముద్ర వేశారని అభిప్రాయపడ్డారు. వారికి అధికారం ఉందని విధులు దుర్వినియోగం చేశారని, లేనిపోని ముద్ర వేశారన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.

ఏదో చూసినట్లు చెప్పడమా..

ఏదో చూసినట్లు చెప్పడమా..

ఏదో చూసినట్లుగా శిరీష గురించి కథలు అల్లుతున్నారని ఆమె తండ్రి ఆవేదనగా చెప్పారు. భర్తతో గొడవలు ఉన్నట్లు తమకు ఎప్పుడు కూడా శిరీష చెప్పలేదన్నారు. భర్తపై ఎప్పుడు ఫిర్యాదు చేయలేదన్నారు. అలాగే తమ అల్లుడు కూడా మా అమ్మాయి ఇలాంటిది అని చెప్పలేదని, భావించలేదన్నారు. పోలీసులు తప్పుడు ముద్ర వేశారని ఆవేదన చెందారు. శిరీష మమృతి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏం గొడవ జరిగిందో వెలుగు చూడాలన్నారు.

షాక్‌లో ఉన్నా.. శిరీష భర్త

షాక్‌లో ఉన్నా.. శిరీష భర్త

తాను శిరీష మృతి చెందిన షాక్‌లో ఉన్నానని భర్త సతీష్ చంద్ర అన్నారు. తనకు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. తనకు వేకువజామున 4.07 నిమిషాలకు ఫోన్ చేసిందని, అప్పుడు తాను లిఫ్ట్ చేయలేదన్నారు. పోలీసులు ఆమె ఏ సమయంలో చనిపోయిందో చెప్పలేదన్నారు.

ఆత్మహత్య కాదు..

ఆత్మహత్య కాదు..

మరోవైపు, శిరీష తల్లి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మెడకు వైర్ చుట్టి చంపేశారని ఆరోపించారు. శిరీష తలపై బలంగా కొట్టారని, కారులో జుత్తు పట్టుకొని లాక్కెళ్లారని, అలాంటప్పుడు రెండు ఫ్లోర్లు వేగంగా ఎలా ఎక్కిందని ప్రశ్నించారు. రాజీవ్, శ్రవణ్‌లే చంపేశారని అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురుది పోలీసులు చెబుతున్నట్లు ఆత్మహత్య కాదని, హత్యే అన్నారు.

ఎస్సై భార్య ఏం చెప్పారంటే.. ఫోన్లో హెచ్చరించిన వ్యక్తి ఎవరు

ఎస్సై భార్య ఏం చెప్పారంటే.. ఫోన్లో హెచ్చరించిన వ్యక్తి ఎవరు

తన ప్రవర్తనే వల్లే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని, తనపై విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే ఎస్సై ప్రభాకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పడాన్ని ఎస్సై భార్య తప్పుబట్టారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడలేదని, పోలీసు ఉన్నతాధికారులే తన భర్తను చంపారని ఆరోపించారు. పోలీస్ క్వార్టర్స్‌కు తన భర్త ఎన్నడూ గన్ తీసుకురాలేదని చెప్పారు. ఏసీపీ గిరిధర్ తన భర్తను వేధించేవాడన్నారు. ఈ విషయం గురించి తనతో తన భర్త చాలాసార్లు చెప్పాడని, తన భర్తది ముమ్మాటికీ ఉన్నతాధికారులు చేసిన హత్యే అన్నారు. ఇదిలా ఉండగా, శిరీష ఆత్మహత్య అనంతరం ఎస్సై ప్రభాకర్ రెడ్డిని ఓ వ్యక్తి ఫోన్లో హెచ్చరించారు. దీంతో ఫోన్లో హెచ్చరించిన వ్యక్తి ఎవరు అనేది తేలాల్సి ఉంది. పోలీసులు ఎస్సై కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు.

శిరీష-రాజేష్‌లు స్టూడియోలో భార్యాభర్తల్లా..

శిరీష-రాజేష్‌లు స్టూడియోలో భార్యాభర్తల్లా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన విజయలక్ష్మి అలియాస్‌ శిరీష హైదరాబాద్‌లో మేకప్‌ ఆర్టిస్టుగా పని చేస్తోంది. 13ఏళ్ల క్రితం సతీశ్‌ చంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కుమార్తె ఉంది. నాలుగేళ్ల క్రితం విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌ కుమార్‌తో కలిసి పనిచేస్తోంది. పెళ్లిళ్లకు ఫోటోలు తీయడం రాజీవ్‌ వృత్తి. అదే పెళ్లిళ్లకు శిరీష మేకప్‌ ఒప్పందాలు చేసుకునేది. ఈ క్రమంలో రాజీవ్‌, శిరీషల మధ్య స్నేహం మరింత చిగురించి.. అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ స్టుడియోలో భార్యభర్తల్లా మెలిగేవారని చెప్పారు. వీరి సంబంధం గురించి శిరీష భర్తకు తెలియదని చెప్పారు.

ఎవరీ తేజస్విని?

ఎవరీ తేజస్విని?

మరోవైపు, తేజస్విని అనే మరో అమ్మాయితో రాజీవ్‌కు పరిచయమైంది. బెంగళూరులో పని చేస్తున్న ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు బదిలీపై వచ్చింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా రాజీవ్‌ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన తేజస్విని నిలదీసేందుకు అతడి ఆఫీస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో రాజీవ్‌, శిరీషల అక్రమ సంబంధం బయటపడిందని చెప్పారు. దీంతో తేజస్విని తరుచూ రాజీవ్‌ స్టుడియోకి వెళ్లి గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలో మే 30న తేజస్విని రాజీవ్‌ స్టుడియోకు వెళ్లినప్పుడు శిరీష, తేజస్విని మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రాజీవ్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారి ఘర్షణ అక్కడికి చేరింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శిరీష, రాజీవ్‌లు తమకు తెలిసిన శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Commissioner of Police (CP) Mahender Reddy has disclosed the details relating to the suicide of the beautician A Vijayalakshmi alias Sirisha. The police have confirmed that the beautician who died under suspicious circumstances committed suicide.
Please Wait while comments are loading...