మరో కోణం.. రాజీవ్‌కు శిరీష సంబంధం చూసిందా: మిష్టరీ వీడినా...?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు శుక్రవారం తేల్చారు. శిరీషకు రాజీవ్‌కు మధ్య వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు.

చదవండి: రాజీవ్‌తో శిరీషకు సంబంధంపై ఆగ్రహం

శిరీష ఆత్మహత్య, కుకునూరుపల్లిలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందని అభిప్రాయపడ్డారు. అయితే, మిష్టరీ వీడినట్లు కనిపించినప్పటికీ మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరో కోణం.. శిరీష రాజీవ్‌కు సంబంధం చూసిందా?

మరో కోణం.. శిరీష రాజీవ్‌కు సంబంధం చూసిందా?

శిరీష, రాజీవ్‌లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఆమె అతనికి ఓ సంబంధం కూడా చూసిందనే వాదనలు కూడా ఉన్నాయి. తనకు తెలిసిన వాళ్ల సంబంధాన్ని శిరీష చూసిందని తెలుస్తోంది. అంతలోనే బెంగళూరుకు చెందిన తేజస్వినితో రాజీవ్‌కు పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో శిరీషతో రాజీవ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే వాదనలు తెరపైకి వచ్చాయి.

తేజస్విని ద్వారా వదిలించుకునే ప్రయత్నం..

తేజస్విని ద్వారా వదిలించుకునే ప్రయత్నం..

తేజస్విని పరిచయం కావడంతో శిరీషను వదిలించుకునేందుకు రాజీవ్ ప్రయత్నాలు చేశాడని అంటున్నారు. తేజస్విని పావుగా వాడుకొని ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది.

మిస్టరీ వీడింది.. అనుమానాలు ఎన్నో..

మిస్టరీ వీడింది.. అనుమానాలు ఎన్నో..

శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. అయితే పోలీసుల ప్రెస్ మీట్ తర్వాత అనుమానాలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి.

శిరీషను ఎస్సైకి అప్పగించాలని చూశాడా?

శిరీషను ఎస్సైకి అప్పగించాలని చూశాడా?

శిరీషను కుకునూరుపల్లి తీసుకు వెళ్లిన రాజీవ్.. ఆమెను అక్కడ ఎస్సైకి అప్పగించాలని చూశాడా? శిరీష ఎస్సై గదిలో అరిచినప్పుడు అక్కడి పోలీసులకు ఆ అరుపులు వినిపించలేదా? అసలు నిత్యం సెక్యూరిటీ ఉంటే క్వార్టర్సులోకి వారు ఎలా వెళ్లారు? ప్రభాకర్ రెడ్డ ఓ ఎస్సై అయి ఉండి రాజీవ్, శ్రవణ్‌లను వ్యభిచార గృహాలకు వెళ్లమని చెప్పడం ఏమిటి? అసలు శిరీష ఎందుకు అరిచింది? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

గొడవ జరిగిందే ఆమె కోసం..

గొడవ జరిగిందే ఆమె కోసం..

రాజీవ్ - శిరీషల మధ్య గొడవ వచ్చిందే తేజస్విని కారణంగా. అలాంటప్పుడు పోలీసులు ఆమెను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఆమె పైన కేసు కూడా ఉండదని చెప్పడం ఏమిటని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Commissioner of Police (CP) Mahender Reddy has disclosed the details relating to the suicide of the beautician A Vijayalakshmi alias Sirisha. The police have confirmed that the beautician who died under suspicious circumstances committed suicide.
Please Wait while comments are loading...