హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త .. 60 కొత్త కోచ్‌ లు!

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఎదురవుతున్న తీవ్రమైన రద్దీని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సుమారు 60 కొత్త మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టర్ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తో ఈ వారంలోనే MoU కుదుర్చుకోవాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15నెలల్లోనే ఈ కోచ్‌లు సరఫరా అయ్యే అవకాశం ఉంది.

నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో రద్దీ

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజువారీ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో - ముఖ్యంగా నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో ఉదయం, సాయంత్రం ఆఫీస్ సమయాల్లో రద్దీ అత్యధికంగా ఉంటోంది. ప్రస్తుతం 56 మెట్రో రైళ్లు సర్వీసు అందిస్తున్నాయి. వీటిలో చాలా రైళ్లు మూడు కోచ్‌లతో మాత్రమే నడుస్తున్నాయి.

Hyderabad Metro is set to procure 60 new coaches with an MoU good news by telangana govt

వేగంగా కొత్త కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ

దీంతో ప్రయాణికులు నిలబడి ప్రయాణించవలసి వస్తోంది. కొందరు తోసుకుంటూ ఎక్కి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అసౌకర్యాలను తొలగించడమే లక్ష్యంగా కొత్త కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్తోంది. మెట్రో ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు ప్రక్రియ సులభంగా, వేగంగా జరుగుతోంది. గతంలో దక్షిణ కొరియా హ్యుండాయ్ రోటెమ్ సంస్థ నుంచి కోచ్‌లు కొనుగోలు చేశారు.

కొత్త కోచ్‌లు వచ్చిన తర్వాత ఆ మార్గాల్లో సీటింగ్ సామర్ధ్యం వృద్ధి

ఇప్పుడు హ్యుండాయ్ రోటెమ్ సంస్థ తన అధునాతన డ్రైవర్‌లెస్ టెక్నాలజీని BEMLకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అంగీకరించింది. ఇది భారతీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది. BEML ఇప్పటికే దేశంలోని అనేక మెట్రో ప్రాజెక్టులకు విజయవంతంగా కోచ్‌లు సరఫరా చేసిన అనుభవం ఉంది. కొత్త కోచ్‌లు వచ్చిన తర్వాత రద్దీ మార్గాల్లో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగడంతో పాటు ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ప్రయాణికుల సౌకర్యంతో పాటు, పెరగనున్న మెట్రో సర్వీసుల నాణ్యత

ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో కూడా హాయిగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఇది ప్రయాణికుల సౌకర్యాన్ని మాత్రమే కాకుండా మెట్రో సర్వీసుల నాణ్యతను కూడా పెంచుతుంది. గతంలో రద్దీని తగ్గించడానికి నాగ్‌పూర్ మెట్రో నుంచి కోచ్‌లు లీజుకు తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి కానీ సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలనుకున్నా కొన్ని అంతర్గత కారణాలతో ఆలస్యమైంది.

బండి భగీరథ్ పోక్సో కేసుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే!
బండి భగీరథ్ పోక్సో కేసుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే!

నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో మెట్రో కీలక పాత్ర

ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మెట్రో మరింత సమర్థవంతంగా, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారుతుంది. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేయడం ద్వారా ప్రజల రోజువారీ జీవితాలను మెరుగుపరుస్తోంది. భవిష్యత్తులో ఫేజ్-2 విస్తరణకు కూడా ఇది బలమైన పునాది వేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+