90 రోజులలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. బాధ్యత తీసుకున్న కీలక మంత్రి!

ఏపీ మంత్రి లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనలో కీలక ప్రకటన చేశారు. కర్నూలులో 90 రోజులలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చాలా కాలంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక వారికి శుభవార్త చెప్పిన లోకేష్ తాము ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని అన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తా

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాను యువగళం పాదయాత్ర నిర్వహించినట్టు తెలిపారు. మొత్తం 45 రోజుల పాటు నిర్వహించిన యువ గళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నీ గుర్తు ఉన్నాయని లోకేష్ తెలిపారు. హామీల పుస్తకాన్ని చూసుకుని ప్రతీ హామీని నెరవేర్చటం కోసం చర్యలు చేపట్టానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కర్నూలు లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

AP Job Calendar 2026: జాబ్ క్యాలెండర్ పై లోకేష్ ప్రకటన- 3168 ఉద్యోగాల భర్తీ..!
AP Job Calendar 2026: జాబ్ క్యాలెండర్ పై లోకేష్ ప్రకటన- 3168 ఉద్యోగాల భర్తీ..!
High Court Bench to be set up in Kurnool within 90 days minister nara lokesh takes responsibility

ఏపీకి పరిశ్రమలు తెస్తున్నాం

పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ పోరాడి మరీ పరిశ్రమలను కర్నూలుకు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ఆదోనికి పరిశ్రమలు వస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు, రాయలసీమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతుందని, టాటా సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నామని లోకేష్ పేర్కొన్నారు.

జొన్నగిరిలో బంగారం కర్మాగారం, రాయలసీమలో ఉద్యాన హబ్

కూటమి ప్రభుత్వ హయాంలో జొన్నగిరిలో బంగారం కర్మాగారం వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. అంతేకాదు తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ఉద్యాన హబ్ వచ్చిందని గుర్తు చేశారు. అయితే వైసిపి హయాంలో మాత్రం రాయలసీమలో రక్తం ఏరులై పారిందని, కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, యుద్ధ విమానాలు తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

తల్లికి వందనం నిధుల విడుదల..! అప్పటివరకూ పడతాయన్న లోకేష్..!
తల్లికి వందనం నిధుల విడుదల..! అప్పటివరకూ పడతాయన్న లోకేష్..!

రాయలసీమ అభివృద్ధికి, కర్నూలు పురోగతికి చర్యలు

వైసిపి హయాంలో జరిగిన విధ్వంసం గురించి ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 90% రాయితీని ఎత్తేసారు అని గుర్తు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి అమర రాజా, జాకీ వంటి సంస్థలను తరిమేశారు అని లోకేష్ మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి, కర్నూలు పురోగతికి చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+