రాజీవ్‌తో శారీరక సంబంధం: 'శిరీష పరువు తీస్తారా.. తేజస్విని మాటేమిటి?'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫిలింనగర్‌లో మృతి చెందిన బ్యూటిషియన్ శిరీషది ఆత్మహత్య అని, ఆమెకు రాజీవ్‌తో శారీరక సంబంధం ఉందన్న వార్తలపై మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు.

శిరీషది ఆత్మహత్య అని చెప్పడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబం అంటోంది. పోలీసుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. కేసులో తమకు సరైన న్యాయం జరగలేదన్నారు. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు.

అందుకు శిరీష పరువు తీస్తారా?

అందుకు శిరీష పరువు తీస్తారా?

అనుమానాలన్నింటిని పోలీసులు తేల్చేశారని శిరీష అక్క వాపోయారు. వాళ్ల వర్షన్ వాళ్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులే ఇలా మాట్లాడుతుంటే, ఇక తమలాంటి మామూలు వాళ్లకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. పోలీసులను వెనుకేసుకొచ్చేందుకు శిరీష పరువు తీసే ప్రయత్నం చేశారన్నారు. తమ వాళ్లను కాపాడుకునేందుకు మా వాళ్లపై ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల డిపార్టుమెంటు వాళ్లను కాపాడుకుంటున్నారన్నారు.

తేజస్వినిని ఎందుకు తప్పించారు?

తేజస్వినిని ఎందుకు తప్పించారు?

ఈ గొడవ అంతా తేజస్విని గురించి అని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆమెపై కేసు పెట్టమని ఎందుకు చెబుతున్నారని శిరీష అక్క ప్రశ్నించారు. కేసు ఉండదని చెప్పడం బాధాకరమన్నారు. అంటే ఆమె వనుక ఎవరైనా బలమైన వ్యక్తులు ఉన్నారా అని ప్రశ్నించారు. చనిపోయిన అమ్మాయిపై ముద్ర వేశారన్నారు.

ఉద్యోగం చేసే అమ్మాయిలకు ఆ ముద్ర వేస్తారా?

ఉద్యోగం చేసే అమ్మాయిలకు ఆ ముద్ర వేస్తారా?

శిరీష పైన పోలీసులు దారుణమైన ముద్ర వేశారని, ఉద్యోగం చేసే అమ్మాయిలపై ఇలాంటి ముద్ర వేయడం దారుణమని శిరీష అత్త ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తాము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రాజీవ్‌ను కలిసినప్పుడు.. తేజస్వినియే శిరీషను టెన్షన్‌కు గురి చేసిందని చెప్పాడని, ఇప్పుడు ఎస్సై వల్ల చనిపోయిందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తేజస్విని వల్లే...

తేజస్విని వల్లే...

శిరీష గురించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ చెప్పింది విని మేం షాకయ్యామని శిరీష అత్త అన్నారు. మా పిల్లను పోగొట్టుకున్న బాధలో ఇప్పుడు మేం ఉన్నామని, అలాంటి తమకు ఇప్పుడు ఆమెపై మరో ముద్ర వేసి బాధించారని అభిప్రాయపడ్డారు. తేజస్విని వల్లే శిరీష ఒత్తిడికి లోనయిందని అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad CP Mahender Reddy Reveals Beautician Sirisha Death Mystery. Sirisha family fired at Police.
Please Wait while comments are loading...