కృత్తికా నక్షత్రంలో కుజుడు.. ఈ 4 రాశుల పంట పండింది

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులతో పాటు అవి ప్రవేశించే నక్షత్రాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే నవగ్రహాలలో ధైర్యానికి, పరాక్రమానికి, ఆత్మవిశ్వాసానికి అధిపతిగా భావించే కుజ గ్రహం (అంగారకుడు) త్వరలోనే ఒక కీలకమైన నక్షత్ర మార్పు చేయబోతోంది. జూన్ 16వ తేదీన గ్రహాల అధిపతి అయిన సూర్యుడికి చెందిన 'కృత్తికా నక్షత్రం' లోకి ప్రవేశించబోతున్నాడు. జులై 5వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులవారి జీవితాల్లో చోటుచేసుకునే కీలక మార్పుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి: కెరీర్‌లో అద్భుతమైన పురోగతి

మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అమృతంతో సమానం అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పట్టిందల్లా బంగారమే కానుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, జీతాల పెంపు లభిస్తాయి. ఊహించని మార్గాల ద్వారా అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి.

Horoscope Mars in the Krittika Nakshatra A Golden Period for These 4 Zodiac Signs

సింహ రాశి: పెరగనున్న కీర్తి ప్రతిష్టలు

సూర్యుడు అధిపతిగా ఉన్న సింహ రాశి వారికి వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు చాలా సులభంగా తొలగిపోతాయి. మీ పనితీరుకు, ప్రతిభకు తగిన ప్రశంసలు, సామాజిక గౌరవం లభిస్తాయి. కొత్తగా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసం.. అఖండ విజయాలు

కుజుడు స్వక్షేత్రమైన వృశ్చిక రాశి వారికి ఈ సమయం అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. మీలో లీడర్‌షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం అత్యంత అనుకూలమైనది. వారు ఆశించిన విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం వల్ల ఎంతటి కఠినమైన పనినైనా అలవోకగా పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

మీన రాశి: విదేశీ యానాలు.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్

మీన రాశి వారికి కుజుడి ప్రభావం వల్ల ఊహించని విధంగా అదృష్టం కలిసిరాబోతోంది. గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఇప్పుడు భారీగా రిటర్న్స్ అందుతాయి. ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. క్లిష్ట సమయాల్లో జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సపోర్ట్ లభించి.. అనుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+