'ఆ కిస్సింగ్ సీన్ చూసి షాకయ్యా..!'
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. రామ్ చరణ్ నటనపై, చిత్రంలోని ఓ కిస్సింగ్ సీన్‌పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రారంభంలో రామ్ చరణ్ యాక్టింగ్ సామర్థ్యంపై తనకు కొన్ని సందేహాలు ఉండేవని ఏఆర్ రెహమాన్ నిర్మొహమాటంగా అంగీకరించారు.
సినిమా విడుదలకు ముందు దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న ఓ ప్రమోషనల్ వీడియోలో ఏఆర్ రెహమాన్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో రామ్ చరణ్ ఎలా నటిస్తాడో అని నా మనసులో చిన్న అనుమానం ఉండేది. ఈ కల్పిత పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేయగలరా లేదా అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. రామ్ చరణ్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తన అద్భుతమైన నటనతో ఆ కల్పిత పాత్రకు ప్రాణం పోశారు" అని ఏఆర్ రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదే క్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల మధ్య వచ్చే ఓ కిస్సింగ్ సీన్ గురించి కూడా ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. "సినిమాలో కొన్ని సన్నివేశాలను చరణ్ ఎలా చేస్తాడో అని నేను ఆసక్తిగా గమనించాను కానీ ఆయన ప్రతి ఫ్రేమ్‌లోనూ చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా ఆ కిస్సింగ్ సీన్ ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే.. ఆ క్షణంలో ఆయన నిజంగా జీవించినట్లు అనిపించింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా రక్తం, చెమట చిందించారో ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది" అని ఏఆర్ రెహమాన్ ప్రశంసించారు.
#ARRahman:
— Whynot Cinemas (@whynotcinemass_) June 2, 2026
“Some of the scenes were like, ‘How is he gonna do this? How is he gonna feel it?’ But he did it very naturally.
Even that KISSING scene.. So I felt like he really lived in that character.”#RamCharan #Peddi #JanhviKapoor pic.twitter.com/2KFVmQGcxe
ఈ సందర్భంగా 'పెద్ది' సినిమా కథాంశంపై కూడా ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫోషించిన ముఖ్య పాత్ర ఒకే సారి క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ అనే మూడు భిన్నమైన క్రీడలలో రాణిస్తుందని వెల్లడించారు. మనిషి సంకల్ప బలాన్ని, మెదడుకున్న అపరిమితమైన శక్తులను ఈ సినిమా చూపిస్తుందని ఆయన అన్నారు. మన ఆలోచనలకు హద్దులు లేనప్పుడే అద్భుతాలు సృష్టించవచ్చని.. క్రీడల్లోనైనా, సంగీతంలోనైనా ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన విశ్లేషించారు.
చివరగా దర్శకుడు బుచ్చిబాబు సనా మేకింగ్ స్టైల్‌ను అగ్ర దర్శకుడు శంకర్‌తో పోలుస్తూ ఏఆర్ రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. "బుచ్చిబాబు పనితీరులో నాకు లెజండరీ డైరెక్టర్ శంకర్ ముద్ర కనిపించింది. శంకర్ దర్శకత్వం వహించిన 'జెంటిల్‌మెన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు' సినిమాల్లో హీరోకు ఓ బలమైన ఆశయం ఉంటుంది. అదే సమయంలో ఆ సినిమాలు కమర్షియల్‌గానూ అద్భుతంగా అలరిస్తాయి. 'పెద్ది' కూడా అదే కోవకు చెందిన చిత్రం. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ, తన గ్రామం కోసం, మానవత్వం కోసం పోరాడే ఒక గొప్ప ఆశయం ఇందులో ఉంది. శంకర్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎలా అనుభూతి కలుగుతుందో, 'పెద్ది' చూస్తున్నప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలిగింది" అంటూ రెహమాన్ చిత్ర బృందాన్ని అభినందించారు.












Click it and Unblock the Notifications