హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటి యజమానిని కట్టేసి దోపిడీ, ఎంటిఎం నుంచి రూ. 50 వేలు డ్రా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆరుగురు దుండగులు దోపిడీకి దిగిన ఘటన వెలుగు చూసింది. ఇంట్లో అద్దెకు దిగి ఇంటి యజమానిని బెదిరించి, తాళ్లతో కట్టేసి ఐదు తులాల బంగారాన్ని దోచుకున్నారు. దాంతో ఆగకుండా ఎటిఎం నుంచి 50 వేల రూపాయలు డ్రా చేసుకున్నారు.

ఈ ఘటన పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. గోదావరి హోమ్స్‌లో నివాసం ఉంటున్న బులుసు రమేష్ బాబు కారంపొడి వ్యాపారి. ఇతనికి సుచిత్ర రోడ్డులోని చర్మాస్ జీన్స్ ఫ్యాక్టరీ వెనుక గల జెకె నగర్‌లో మరో ఇల్లు ఉంది. పదిహేను రోజు క్రితం శర్మ అనే వ్యక్తి రూ.5 వేలు చెల్లించి పై అంతస్థులో అద్దెకు దిగాడు.

బుధవారం ఉదయం అదే ఇంట్లో కింది పోర్షన్ గోదాం కోసం కావాలని రమేష్ బాబుకు శర్మ ఫోన్ చేశాడు. గురువారం అగ్రిమెంట్ రాసుకుందామని ఉదయం గం.9.15 నిమిషాలకు మరో ఫోన్ చేశాడు. తొమ్మిదిన్నరకు రమేష్ బాబు అక్కడికి వెళ్లాడు. ఇంట్లో ప్రవేశించగానే ఆరుగురు దుండగులు అతన్ని పడకగదిలోకి తీసుకుని వెళ్లా చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు.

 Six persons looted a house in Hyderabad

రమేష్ బాబు మెడలోని ఐదు తులాల గొలుచు దోచుకున్నారు. తర్వాత పర్సులో ఉన్న ఎటిఎం కార్డు లాక్కుని చంపేస్తామని బెదిరించి పిన్ నెంబర్ రాబట్టారు. ఎటిఎం సెంటర్‌కు రూ.50 వేలు డ్రా చేసుకున్నారు. బ్యాంకులో పెద్ద ఎత్తున డబ్బు ఉందని కనిపెట్టిన దొంగులు తమకు 14 లక్షలు కావాలని, ఆ మొత్తానికి చెక్కు ఇవ్వాలని బెదిరించారు.

చెక్ బుక్క గోదావరి హోమ్స్‌లోని ఇంట్లో ఉందని రమేష్ బాబు చెప్పాడు. ఇంటికి వెళ్లి చెక్ బుక్కుతో జీడిమెట్ల గ్రామ సమీపంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు రమేష్‌ను బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. వీపుపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. మీ ఇంటి వద్ద మరో నలుగురు ఉన్నారని, తేడా వస్తే మొత్తం కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరించారు.

అయితే, రమేష్ బాబు ఆందోళనగా ఉండడాన్ని గమనించిన బ్యాంక్ ఉద్యోగులు ఆరా తీశారు. దాంతో అతను అసలు విషయం చెప్పాడు. బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. క్షణాల్లో పోలీసు వాహనం వచ్చి ఆగింది. ఇది గమనించి ఇద్దరు పారిపోయారు. ఇంటి వద్ద ఉన్న దుండగులు కూడా కనిపించకుండా పోయారు. ఫోన్ కాల్స్‌ను బట్టి దుండగులు గుంటూరు జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

English summary
Six members of a gang looted a man Bulusu Ramesh Babu in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X