Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SLBC సొరంగ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్ .. తాజా పరిస్థితి ఇలా!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది ఆచూకీ లేదు. వారి ఆచూకీ కనిపెట్టడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఇప్పటివరకు శూన్యమే. ఈ ఘటన జరిగి మూడు రోజులకు పైగా కావడంతో వారు సజీవంగా ఉన్నారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రులు వారు సజీవంగా ఉండడం అనుమానమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే ర్యాట్ హోల్ మైనర్లు కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఘటనస్థలి వద్ద నలుగురు మంత్రుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది 14వ కిలోమీటర్ వద్ద ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

SLBC tunnel accident Experts are being brought in from NGRI and Geological Survey of India

పూడికతో పుష్ కెమెరా టీంలు వైఫల్యం
వారిని కనిపెట్టడానికి ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలు తీసుకువెళ్లిన పూడిక కారణంగా ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు. లోపల బోరింగ్ మిషన్ దెబ్బ తినడంతో పుష్ కెమెరా టీంలు ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు గత మూడు రోజులుగా ఉమ్మడి బృందంగా ఏర్పడి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

సొరంగంలో పెరుగుతున్న బురద ప్రవాహంతో సహయక చర్యలకు ఆటంకం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సొరంగంలో చిక్కుకున్న ఇంజినీర్లు, కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సైన్యం, నౌకాదళం సహా ఇతర సహాయక బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సొరంగంలో పెరుగుతున్న బురద ప్రవాహంతో సహయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పైకప్పు పూర్తిగా విరిగిపడటంతో డ్రిల్లింగ్ చేసే టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఎన్‌జీఆర్‌ఐ, జియోలాజికల్‌ సర్వే నిపుణులను రప్పిస్తున్న అధికారులు
టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ను తొలగిస్తే పైకప్పు మరింత కూలే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ఎన్‌జీఆర్‌ఐ, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నుండి నిపుణులను రప్పిస్తున్నారు.సొరంగం నుంచి వస్తున్న బురద నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఊటల ద్వారా ఏర్పడిన నీటిని భారీ మోటర్లతో పంపింగ్‌ చేసున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+