రోబో పోలీసును ప్రారంభించిన తెలంగాణ సర్కార్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రోబో పోలీసు హైద్రాబాద్‌లో విదులు నిర్వహించనుంది. తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం నాడు రోబో పోలీసును ప్రారంభించారు.డిసెంబర్ 31వ, తేది నుండి ఈ రోబో పోలీస్ జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహించనుంది.

టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా ప్రారంభమైన 'హెచ్‌ బోట్స్‌' రోబోటిక్స్‌ కంపెనీ పోలీస్‌ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తుంది.అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది.

దుబాయ్‌లో వీల్స్ కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తున్నాయి.. తెలంగాణలో పోలీస్‌ రోబోను హెచ్‌ బోట్స్‌ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండవ పోలీస్‌ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Smart police robot launched Telangana IT secretary Jayesh Ranjan on Friday at Hyderabad.A smart police robot that can recognise people, take complaints, detect bombs, identify suspects, interact with people and answer their queries.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి