స్నేక్‌గ్యాంగ్: మరో ముగ్గురి రిమాండ్
హైదరాబాద్: యవతులు, మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌కు చెందిన మరో ముగ్గురిని పహాడీషరీఫ్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఈ ముఠా నాయకుడు ఫైసల్ దయానీ కటకటాల్లో ఉన్నాడు.
ఫైసల్ దయానీ నేరాల్లో భాగస్తులైన అతని సోదరులు మహ్మద్ బిన్ మహ్మద్ దయానీ(50), అబ్దుల్లా బిన్ మహమూద్ దయానీ(46), మహ్మద్ కరీం(21)లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి స్నేక్‌గ్యాంగ్ కేసులోనే రిమాండ్‌కు తరలించారు.

స్థానికంగా చిల్లర వ్యాపారులను, వలస జీవులపై ఈ ముగ్గురు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, దయాని గ్యాంగ్ గురించి తవ్వేకొద్దీ నేరాల చిట్టా బయట పడుతోంది. మహిళలపై అఘాయిత్యాలే కాకుండా వీరు భూకబ్జాలకూ పాల్పడుతున్నారని సమాచారం. ఇందుకోసం వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద గుమస్తాలుగా పనిచేస్తున్నారు.
పోలీసులు స్నేక్ గ్యాంగ్ బాధితుల నుండి వివరాలు ఆరా తీస్తున్నారు. స్నేక్ గ్యాంగ్ బాధితులు చాలామంది ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు భయంతో ఫిర్యాదు చేయడం లేదని భావిస్తున్నారు. బాధితులు పూర్తి వివరాలు చెప్పాలని, ఫిర్యాదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications