జూబ్లీహిల్స్‌లో కుల సమీకరణం - ఏ వర్గం ఓటింగ్ ఎంత, ఎవరు ఏ పార్టీ వైపు..!?
జూబ్లీహిల్స్ పోరులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కల ఆధారంగా ఆ వర్గానికి చెందిన నేతలతో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక నుంచే సామాజిక లెక్కలు మొదలయ్యాయి. ఇక.. నియోజకవర్గంలో వర్గాల వారీగా ఓట్ల పైన ఒక స్పష్టత వచ్చింది. దీంతో.. ఇప్పుడు ఏ వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఇక్కడ గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.
ఏ వర్గం ఓట్లు ఎన్ని
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మూడు పార్టీలు కులాల వారీగా ఆకర్షించి, గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఉండగా.. అందులో మాదిగ 15,693; మాల 12657 ఓట్లు ఉన్నాయి. రెడ్డి 17,641, లంబాడీ 11364, క్రైస్తవులు 19,396 మంది ఓటర్లున్నారు. ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు.

మద్దతు కోసం
ఇక, వర్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్ చార్జిలుగా నియమించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తుల చేస్తున్నారు. మాగంటి సునీత కు బీఆర్ఎస్ సీటు కేటాయించింది. కమ్మ వర్గానికి చెందిన వారు కావటంతో సునీతకు ఆ వర్గం ఓట్ల మద్దతు పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్, ఇతరులను రంగం లోకి దించి సమావేశాలు జరుపుతోంది. అటు కాంగ్రెస్ కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరు ఏ పార్టీ వైపు
ఇదే సమయంలో కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. తమ మద్దతు కాంగ్రెస్ కే ఉంటుందని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ ను కోరగా.. సానుకూలంగా స్పందించారు. అమీర్ పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పైన సీఎం ను కోరగా..అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సామాజికవర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉన్నారు. కాగా, బీఆర్‌ఎస్ ఆ ఓట్లను గండికొట్టేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ తరఫున లంకెల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్‌రెడ్డి దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే బీఆర్‌ఎస్ పార్టీ కులాల వారీగా తమ నేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరుపుతోంది. దీంతో.. ఈ సమీకరణాలతో తుది గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications