అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు టెక్కీ దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన టెక్కీ భరత్ రెడ్డి మరణించాడు.అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన భరత్‌రెడ్డి మరణించాడు
మూడు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ రెడ్డి మరణించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే భరత్‌రెడ్డి గాయపడినట్లు మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. భరత్‌రెడ్డి మరణం విషయం చెప్పలేక స్నేహితులు సతమతమవుతున్నారు.

సౌత్‌ఫ్లోరిడాలో ఈనెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి భరత్‌రెడ్డి కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు అతనిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో భరత్ గాయపడినట్లుగానే అతడి కుటుంబసభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పారు స్నేహితులు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ అన్న అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications