సికింద్రాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సికింద్రాబాదులో దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారు జామున ఈ హత్య జరిగింది. మృతుడిని సంజయ్ జుంగే (23)గా గుర్తించారు. సికింద్రాబాదు సరోజినీదేవీ రోడ్డులో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద వాకింగ్ చేస్తుండగా దుండగులు దాడి సంజయ్‌ని చేసి హత్య చేశారు.

కారులో వచ్చిన దుండగులు వాకింగ్ చేస్తున్న సంజయ్‌పై కత్తులతో దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వారు అదే కారులో పారిపోయారు. స్థానికులు మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హత్య కేసు చేధిస్తున్నాం: నార్త్ జోన్ డిసిపి
స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగిన హత్య కేసును చేధిస్తున్నామని నార్త్ జోన్ డిసిపి తెలిపారు. 8055 నెంబర్ గల కారులో వచ్చి హత్య చేశారని తెలిపారు. నిందితుడు ప్యారడైజ్, ట్యాంక్ బండ్ వైపు వెళ్లినట్లు సిసి కెమెరాల్లో గుర్తించామని చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. సంజయ్ సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications