సైబర్ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. రూ.2.14 కోట్లు పోగొట్టుకుని..
సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలకు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలతో కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. నిత్యం కొత్త దారులు తొక్కుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఇలా పలు రకాల మార్గాల్లో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మాయ మాటలకు పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్ బయట పడింది.
హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్ బయట పడింది. మహిళ ప్రొఫైల్ ఫోటో పెట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2. 14 కోట్లు కొట్టేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని టీఎన్‌జీఓ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (44)కి గతేడాది డిసెంబర్ లో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ ఫ్రెండ్ అయింది.

ఈ క్రమంలో వీళ్లిద్దరూ రోజూ మాట్లాడుకునేవాళ్లు. ఓ సారి.. తాను స్టాక్ ట్రేడింగ్ ద్వారా బాగా లాభాలు సంపాదిస్తున్నట్లు ఆ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి చెప్పింది. అలా మాయమాటలు చెప్పి, తనతో ఓ యాప్ డౌన్ లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ లో రూ. 31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. మరిన్ని పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశ చూపించింది. అలా ఆ ఉద్యోగి నుంచి రూ. 2. 14 కోట్లు కొట్టేశారు సైబర్ మాయగాళ్లు. ఇక డబ్బు విత్ డ్రా కోసం ప్రయత్నించగా.. అదనంగా రూ.68 లక్షలు కట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించాడు ఆ ఉద్యోగి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications