సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు,హిందుపేర్లతో చెలామణి.!బాంబు పేలుళ్లకు భారీ కుట్ర.!ఏం జరుగుతోంది?
హైదరాబాద్ : గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉగ్ర కదలికలతో పాటు హిందూ పేర్లతో స్థానికులుగా చెలామణి అవుతూ నగరంలోనే హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తూ దర్జాగా ఉగ్ర కుట్రలకు సన్నాహాలు చేస్తున్న అంశాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒడిశాకు చెందిన ముప్పై మూడేళ్ల అబ్దుల్ రహమాన్ దేవీ ప్రసాద్ పాండ్య పేరుతో చెలామణి అవుతుండడమే కాకుండా,హైదరాబాద్‌లోని గోల్కొండలో నివాసం ఉంటున్న అతను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మహ్మద్ సలీంతో కలిసి మధ్యప్రదేశ్‌కు కూడా వెళ్లి వచ్చి నగగరంలో ఉగ్రవాదంవైపు యువతను ప్రేరేపిస్తున్నట్లు తెలుస్తోంది.
కాలేజీ విద్యార్ధులే టార్గెట్ : అబ్దుల్, మహ్మద్ సలీం వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రోజువారి కూలీలను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించారు. దేశంలో షరియా చట్టాలను తీసుకురావడానికి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు. గోల్కొండలోని బడాబజార్‌కు చెందిన ముప్పై రెండేళ్ల డెంటిస్ట్ షేక్ జునైద్ ను కూడా టెర్రరిజం వైపు మళ్లించారు. సలీం, అబ్దుల్, జునైద్ కలిసి హైదరాబాద్‌లోని ముస్లిం యువతను ట్రాప్ చేసేందుకు ప్లాన్ వేశారు.

ఉగ్రవాదం వైపు ప్రేరేపించడమే వారి లక్ష్యం : అందులో భాగంగా హబీబ్ నగర్‌కు చెందిన ముప్పై ఆరేళ్ల ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్బాస్ అలియాస్ బస్క వేణుకుమార్, రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట మఖ్దూం నగర్‌కు చెందిన ముప్పై రెండేళ్ల రోజువారి కూలీలు మహ్మద్ హమీద్), మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన ఇరవై ఏడేళ్ల మహ్మద్ సల్మాన్ తో కలిసి హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు మహ్మద్ సలీం, అబ్దుల్ రహమాన్, షేక్ జునైద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హమీద్‌లను అరెస్టు చేశారు. మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. ఐదుగురిని భోపాల్ కు తరలించారు.

అత్యంత భయంకరమైనది హిజ్బ్ ఉత్ తహ్రీర్ : హిజ్బ్ ఉత్ తహ్రీర్ ఐసిస్ కన్నా భయంకరమైనది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. రసాయనాలతో దాడులు చేయడం, ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో విధ్వంసాలకు పాల్పడడంపై ఈ టెర్రర్ సంస్థ శిక్షణ ఇస్తుంటుంది. గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ సంస్థ మూలాలను గుర్తించి సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంటాయి. ఈ వ్యవహారాల పట్ల తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

హిందువుల పేర్లతో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో హై ప్రొఫైల్ ఉద్యోగాలు : భోపాల్‌కు చెందిన నలభై ఒక్కేళ్ల మహ్మద్ సలీం, హైదరాబాద్ గోల్కొండలోని బడా బజార్ మోతీమహల్‌లో నివాసం ఉంటూ, ఓ మెడికల్ కాలేజీలో సౌరభ్ రాజ్ వైద్య పేరుతో ఉద్యోగం చేస్తున్నాడు. సలీంకు హిజ్బ్ ఉత్ తహ్రీర్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలు, ఐసిస్ సహా మొత్తం 50 దేశాలతో లింకులు ఉన్నాయి. ఈ క్రమంలోనే సలీం దేశ వ్యాప్తంగా యువతకు ఇస్లామిక్ సాహిత్యం నేర్పిస్తూ టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నాడు. వీరి ఆగడాలను కేంద్ర నిఘా వర్గాల ద్వారా హైదరాబాద్ కౌంటర్ ఇంటెలీజెన్స్ పోలీసులు పసిగట్టడంలో విజయం సాధించారు. జరగబోయే పెను విద్వంసం నుంచి నగర ప్రజలను కాపాడారు పోలీసులు.












Click it and Unblock the Notifications