రాజకీయ సన్యాసం వద్దు!: సోమారపును బుజ్జగించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు తప్పుకుంటానని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమారపు సత్యనారాయణతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు.

ఆ నిర్ణయం వద్దు
మంగళవారం మంత్రి కేటీఆర్ తోపాటు సోమారపు సత్యనారాయణ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సోమారపు సత్యనారాయణను బుజ్జగించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

మీరు పార్టీకి అవసరం
‘టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు మీ అనుభవం, పరిజ్ఞానం అవసరం' అని కేటీఆర్.. సోమారపు సత్యనారాయణతో అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని కోరారు.

సోమారపు వాదన
అనంతరం సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను తన పనిని నమ్ముకున్నానని తెలిపారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని స్పష్టం చేశారు. తమ కార్పొరేటర్లు రామగుండం మేయర్‌ను దించాలని నిర్ణయించుకున్నారని, తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. మంత్రి కేటీఆర్ బాగా పనిచేస్తున్నారని సోమారపు ప్రశంసించారు.

మేయర్‌తో విభేదాలు
కాగా, కేటీఆర్ సూచన మేరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను సోమారపు విరమించుకున్నట్లు తెలిసింది. సోమారపు సత్యనారాయణకు, రామగుండం మేయర్‌కు పడటం లేదని, ఈ క్రమంలోనే అవిశ్వాసం తెరపైకి తెచ్చారని సోమారపుపై ఆరోపణలు వచ్చాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications