అంత్యక్రియల్లో రచ్చ.. కోటి రూపాయలు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతానన్న కొడుకు
రూపాయి రూపాయీ నువ్ ఏం చేస్తావ్ అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను తండ్రీ బిడ్డల్ని విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులని కూడా విడగొడతాను అందట... ఇది ఒక ప్రముఖ సినిమాలోని డైలాగ్. ఇప్పుడు దీన్నే నిజం చేస్తూ ఓ హృదయ విదారకర ఘటన చౌ చేసుకుంది. ఓ తండ్రి బ్రతికి ఉన్నంత కాలం తాను ఓ సుపుత్రుడిని కన్నానని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి ఉంటాడు.
కానీ ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయనకి తెలియక పోవచ్చు కానీ సభ్య సమాజానికి అర్ధమయ్యింది .. ఆ కుమారుడు సుపుత్రుడు కాదని కర్కోటకుడు అని. చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టడానికి కోటి రూపాయలు, 10 తులాల బంగారం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నారాయణపేట జిల్లా క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. భార్య మరణించిన తర్వాత ఒంటరిగా మిగిలిన మాణిక్యరావు తన పిల్లల ఇంట్లో ఉంటూ జీవితం గడిపారు. పెద్ద కూతురి ఆర్థిక స్థితి క్షీణంగా ఉండడంతో, ఆమెకు ఊరిలో ఉన్న ఇంటిని రాసిచ్చారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో తన పిల్లల వద్దే ఉంటున్నాడు. ఈ విషయం కొడుకు గిరీష్‌కు నచ్చలేదు.
అయితే వయస్సు మీదపడటంతో మాణిక్యరావు మంగళవారం రాత్రి చనిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న కొడుకు గిరీష్‌కి తండ్రి మరణవార్త తెలిసింది. తండ్రి తనకు 60 లక్షల విలువైన 15 ఎకరాల పొలం ఇచ్చినా కూడా తన సోదరికి ఇల్లు రాసిచ్చినందుకు గుండెల్లో పగ పెంచుకున్నాడు. అందుకే అంత్యక్రియలకు రావడం కుదరదని తెగేసి చెప్పాడా సుపుత్రుడు. ఇంటిని ముగ్గురం సమానంగా పంచుకుందామంటూ బ్రదర్‌కు ఆఫర్ ఇచ్చారు ఆ అక్కాచెల్లిలు. ఇల్లు మొత్తం తనకు ఇస్తేనే వస్తానని.. ఇప్పటికిప్పుడు పత్రాలు రాసిస్తేనే తలకొరివి పెడతానని ఆ గిరీష్ బ్లాక్‌మెయిల్ చేశాడు. బంధుమిత్రులు ఎంత చెప్పినా కూడా ఆ కఠినాత్ముడి మనసు కరగలేదు.
చివరికి ఆ కుటుంబ గొడవ వీధిన పడడంతో పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు. కొడుక్కి నచ్చజెప్పినా వినకపోవడంతో అంత్యక్రియలు చేయకపోతే తామే ఆ కార్యం నిర్వహిస్తామని హెచ్చరించారు. అయినా వినిపించుకోలేదు ఆ కన్న కొడుకు. చివరికి చేసేది లేక.. చిన్న కూతురు తాను తండ్రికి తలకొరువు పెడతానంటూ ముందుకొచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా అంత్యక్రియలు పూర్తి చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆ కొడుకుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications