అత్త శ్రద్ధాంజలి ఫ్లెక్సీ తీసుకొస్తూ అల్లుడు మృతి..!!
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు వరుస మరణాలు సంభవించడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఫుల్మద్ది గ్రామంలో మొదట అత్త మరణం.. ఆ తర్వాత అల్లుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తాన్ని కన్నీటి వాతావరణం చుట్టుముట్టింది.
అత్త మరణం..
ఫుల్మద్ది గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందారు. కాగా ఆమె అల్లుడు శ్రీనివాస్.. వికారాబాద్ పట్టణానికి వెళ్లి ఆమె శ్రద్ధాంజలి బ్యానర్ ప్రింట్ చేయించాడు. అత్తకు నివాళి తెలిపేందుకు స్వయంగా ఆ బ్యానర్ తీసుకెళ్లాలని నిర్ణయించాడు.

రోడ్డు ప్రమాదం..
ఈ క్రమంలోనే బ్యానర్‌ను బైక్‌పై తీసుకుని గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డులోని గుంత కారణంగా బైక్ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం వాహనం అతడిని ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే శ్రీనివాస్ మృతదేహం పక్కన పడిన శ్రద్ధాంజలి బ్యానర్.. అనంతరం అదే బ్యానర్‌ను అతడి మృతదేహంపై కప్పడం చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. ఒకే కుటుంబంలో అత్త-అల్లుడు మృతదేహాలు పక్కపక్కన ఉండటం అక్కడి వాతావరణాన్ని మరింత విషాదకరంగా మార్చింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఒకే రోజు రెండు మరణాలు సంభవించడంతో రెండు కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోయాయి. గ్రామ ప్రజలంతా ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. రహదారులపై గుంతలు ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications