తాగిన మత్తులో తండ్రి పీక కోశాడు: తల్లిపై దాడి చేశాడు
హైదరాబాద్: హైదరాబాదులోని నవోదయ కాలనీలో దారుణ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్న తండ్రి పీక కోశాడు. దాంతో తండ్రి ఎల్లయ్య (60) అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత తల్లిపై కత్తితో దాడి చేశాడు. తల్లి లక్ష్మమ్మ అడ్డు రావడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు.
ఆ తర్వాత నిందితుడు లక్ష్మణ్ పరారయ్యాడు. దీనిపై స్థానికులు కుషాయిగుడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పొలం దగ్గర పంట కాపలాకు వెళ్లిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. శక్రవారం ఉదయం మృతుడిని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ముక్తర్ అహ్మద్, సత్తార్, జాకీర్ హుస్సేన్, షబ్బీర్ లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications