తాగిన మైకంలో తల్లి గొంతు కోసిన తనయుడు

వరంగల్: కన్నతల్లినే హతమార్చేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి కుమారుడు. తాగిన మైకంలో కన్నతల్లిని శుక్రవారం రాత్రి కత్తితో గొంతుకోసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తిలో జరిగింది.

వనపర్తి గ్రామానికి చెందిన కౌడె సోమయ్య తల్లి కౌడె కొమురమ్మ వృద్ధాప్యంతో మతిస్థిమితం కోల్పోయి కలవరింపులు చేస్తూ అంధత్వంతో వీధుల వెంట తిరుగుతుండేది. ఈ నెల 7న ఇంటి పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ (సంప్‌)లో కొమురమ్మ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కొమురమ్మను బయటకు తీశారు. అనంతరం ఆమె మరోసారి సంప్‌లో పడకుండా పైభాగాన సిమెంట్‌ బిళ్లను మూతగా ఏర్పాటు చేశారు.

Son slits mothers throat in Warangal district

అయినప్పటికీ మతిస్థిమితంలేక మరోసారి గురువారం కొమురమ్మ సంప్‌లో దిగబోతుండగా కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకువచ్చారు. దీంతో విసుగుచెందిన కొడుకు సోమయ్య గురువారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. సోమయ్య ఇంటికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు భార్య సోమలక్ష్మితో సహా అందరూ గ్రామపంచాయతీ వద్ద బుర్రకథ చూసేందుకు వెళ్లారు.

అప్పటికే చలితో మూలుగుతున్న తల్లి కొమురమ్మ సోమయ్య కంటపడింది. తాగిన మైకంలో తల్లి కొమురమ్మ గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో కొమురమ్మ రక్తపుమడుగులో పడిపోవడంతో భయాందోళనకు గురైన సోమయ్య పక్కింటి వారికి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే గ్రామస్థులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+