గురువారం సోనియా గాంధీ పుట్టినరోజు.!ఊరూ వాడా పండుగ చేసుకోవాలె.!పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపు.!
హైదరాబాద్ : గురువారం ఎఐసీసీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్బంగా తెలంగాణ కాంగ్రెస్ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఊరూ వాడా పండుగ జరుపుకోవాలని టీపిసిసి నిర్ణయించింది. మేడం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుకోవాలని, గురువారం అన్ని పోలింగ్ బూత్ స్థాయిలతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది.
సోనియా గాంధీ జన్మదినం తోపాటు డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిన రోజని, రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నామని టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ బూత్ లో పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమంలో పాల్గొంటారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

అంతే కాకుండా కాంగ్రెస్ మెంబర్ షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇష్యురెన్స్ కల్పిస్తున్నామని టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ నియమించిన సమన్వయ కర్తల ద్వారా ఈ మెంబర్ షిప్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూన్ 26 వరకు పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కొనసాగుతుందని అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మహేష్ కుమార్ తెలిపారు.

వడ్ల కొనుగోలు పై టీఆరెఎస్, బీజేపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని మహేష్ కుమార్ మండి పడ్డారు. బీజేపీ కార్పొరేట్ పార్టీ ఐతే, కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని స్పష్టం చేసారు. ప్రతి నియోజక వర్గంలో, బూతు స్ధాయిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి సోనియా గాంధీకి ఘనంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపాలని, మెంబర్ షిప్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications