తెలంగాణ నుంచి సోనియా పోటీ, సీటు ఫిక్స్ - బీజేపీ నుంచి సినీ సెలబ్రటీ..!!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కాంగ్రెస్ 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 12 స్థానాలకు దాదాపు అభ్యర్దులను ఖరారు చేసింది. బీజేపీ కేడర్ ను ఎన్నికలకు సిద్దం చేయటానికి ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అటు బీఆర్ఎస్ తో కేటీఆర్ చేవెళ్ల నుంచి లోక్ సభ ఎన్నికల సమీక్షలు ప్రారంభించారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
మరో ఎన్నికల సమరం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ సమరానికి సిద్దం అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. సోనియాను మాల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నట్టు సమాచారం. కాగా, సీఎం రేవంత్ మాల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచారు. తొలుత మెదక్ నుంచి సోనియా ను పోటీ చేయించాలని భావించినా...ఢిల్లీ నేతల చర్చల తరువాత ఇప్పుడు సోనియాను మల్కాజ్ గిరి నుంచే పోటీ చేయించే అవకాశముందని చెబుతున్నారు. కాగా, సంక్రాంతికి కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది.

సోనియా పోటీ చేస్తారా : బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. మాజీ మంత్రి మల్లారెడ్డిని ఇక్కడ బరిలోకి దింపే అవకాశం ఉంది. సోనియా పోటీకి దిగితే బీఆర్ఎస్ కు ఈ సీటు లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. ఇక, బీజేపీ నుంచి పలువరు ముఖ్య నేతలు మల్కాజ్ గిరి సీటు కోసం పోటీ పడుతున్నారు. మల్కాజ్‌గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ. కచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎన్.రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి తనకు ఛాన్స్ ఉంటుందేమోనని ఈటల భావిస్తున్నారు. అయితే ఇదే సీటు మీద జాతీయ నేత మురళీధర్ రావు ఫోకస్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే, సోనియా పోటీ చేయటం ఖాయమైతే ఇక్కడ నుంచి సినీ సెలబ్రెటీని బరిలోకి దింపే ఆలోచన లో బీజేపీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది.

బీజేపీ నుంచి ఎవరు : కొద్ది రోజుల క్రితం వరకు ప్రధాని మోదీ సైతం దక్షిణాది నుంచి ఈ సారి పోటీ చేయబోతున్నారని..అందులో భాగంగా మల్కాజ్ గిరి నుంచి పోటీకి ఛాన్స్ ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సోనియా పోటీ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్న సమయంలో బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, తరువాత సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా యూపీ నుంచి పని చేసిన ఒక ప్రముఖ మాజీ హీరోయిన్ జయప్రద, మారో హీరోయిన్ మాజీ ఎమ్మెల్యుే జయసుధ పేర్లను ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మల్కాజ్ గిరి లోకసభ పరిధిలో ఏపీ మూలాలు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగు ఉన్నాయి. దీంతో, వారి ఓట్లతో పాటుగా మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సోనియా పోటీ ఖరారైతే బీజేపీ తమ అభ్యర్దిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications