తెలంగాణ పార్టీ నేతలకు సోనియా రోడ్ మ్యాప్ - వారికి గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోందని.. తెలంగాణలోనూ పరిస్థితి అనుకూలంగా ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ సందర్భం గెలుపుకు అనుకూలంగా మలచుకోవాలని నిర్దేశించారు. తెలంగాణ పార్టీ కోసం సమయం కేటాయించటానికి తాను సిద్దంగా ఉన్నానని హామీ ఇచ్చారు.

అధికారంలోకి రావాల్సిందే
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని సోనియా గాంధీ నిర్దేశించారు. వచ్చే నాలుగు నెలల పాటు రాష్ట్ర కాంగ్రస్ నేతలు అధికారమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకగా సోనియా సమావేశమయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆరా తీసారు. తెలంగాణలో ఎన్నకల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సోనియా స్పష్టం చేసారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యారంటీ కార్డు స్కీముల హామీ బాగా పని చేసిందని..తెలంగాణలో ప్రకటించే గ్యారంటీ కార్డెకార్డు స్కీములను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

Sonia gandhi

తెలంగాణపై ఫోకస్
హామీలు ఇవ్వటంతో పాటుగా..వాటికి పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రజల్లో భరోసా కల్పించేలా ముందుకు వెళ్లాలని సూచించారు. కర్ణాటకలో ఇప్పటికే నాలుగు గ్యాంరటీ కార్డు స్కీమ్ లు అమలు, హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు పాత ఫించన్ విధానం పునరుద్దరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని నిర్దేశించారు. అసెంబ్లీ ఎణ్నికల సందర్భంగా తెలంగాణ కోసం తాను తగిన సమయం ఇస్తానని పార్టీ నేతలకు సోనియా హామీ ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా రాహుల్, ప్రియాంకల సేవలను వినియోగించుకోవాలని సూచించినట్లు పార్టీ నేతల సమాచారం. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రం ఏర్పాటు చేసామని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Sonia gandhi

గ్యారంటీ స్కీంలతో ముందుకు
అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి, శ్రేయోధనంలోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. సీడబ్ల్యూసీ సామవేశాల నిర్వహణ తో తెలంగాణలో నూతన అధ్యాయం ప్రారంభం కావాలని సూచించారు. తెలంగాణ ప్రతీ రంగంలోని అగ్రభాగాన నిలుస్తూ..ఆత్మ గౌరవంతో బతికేలా తెలంగాణను..దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సోనియా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసారు. ఇక ఈ రోజు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు. ఇదే సమంయలో తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా..ప్రచారం జరుగుతన్నట్లుగా వాయిదా పడతాయా అనేది మరో ఆసక్తి కర చర్చ సాగుతోంది. దీని పైన రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+