ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్.. పలు రైళ్లు రద్దు..
ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని పలు రూట్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు మార్గాల్లోని ట్రైన్లను అక్టోబర్ 1 నుంచి 31వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణం చేసేవారు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరంది. వీటితోపాటు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
పలు మార్గాల్లో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దుచేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. వివిధ మార్గాల్లో 12 రైళ్లు అక్టోబరు 1 నుంచి 31 వరకు రద్దుచేసినట్టు పేర్కొంది. రద్దు చేసిన ట్రైన్లలో ఎక్కువశాతం ప్యాసింజర్లే ఉన్నాయి.

రద్దయిన రైళ్ల జాబితా ఓసారి చూద్దాం..
07596 అనే నెంబర్‌గల కాచిగూడ- నిజామాబాద్ ట్రైన్,
07593 అనే నెంబర్‌గల నిజామాబాద్- కాచిగూడ ట్రైన్,
47222 అనే నెంబర్‌గల మేడ్చల్- లింగంపల్లి ట్రైన్,
47225 అనే నెంబర్‌గల లింగంపల్లి- మేడ్చల్ ట్రైన్,
47235 అనే నెంబర్‌గల మేడ్చల్- సికింద్రాబాద్ ట్రైన్, ,
47236 అనే నెంబర్‌గల సికింద్రాబాద్- మేడ్చల్ ట్రైన్,
47237 అనే నెంబర్‌గల మేడ్చల్- సికింద్రాబాద్ ట్రైన్,
47238 అనే నెంబర్‌గల సికింద్రాబాద్- మేడ్చల్ ట్రైన్,
47242 అనే నెంబర్‌గల మేడ్చల్- సికింద్రాబాద్ ట్రైన్,
47245 అనే నెంబర్‌గల సికింద్రాబాద్- మేడ్చల్ ట్రైన్,
47228 అనే నెంబర్‌గల మేడ్చల్- సికింద్రాబాద్ ట్రైన్,
47229 అనే నెంబర్‌గల సికింద్రాబాద్- మేడ్చల్ ట్రైన్, వచ్చే నెల 1 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.
వీటితో పాటు 07850 అనే నెంబర్‌గల కాచిగూడ-మెదక్ ట్రైన్‌ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1వ తేది నుంచి 31వతేదివరకు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications