తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 26 ప్రత్యేక రైళ్లు, రూట్.. షెడ్యూల్..!!
తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణీకుల కోసం ప్రత్యేక రైళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతన్న కొన్ని ప్రత్యేక రైళ్లను కొనసాగించనుంది. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండడంతో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైళ్ల సేవలను వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయించారు. చర్లపల్లి-తిరుపతి (07017) ప్రత్యేక రైళు శుక్ర, ఆది వారాల్లోనూ అదే విధంగా తిరుపతి నుంచి (07018) ప్రత్యేక రైలు రైలు సోమ, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఇవి కాచిగూడ, ఉందా నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇక ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి (07251)రైలు... ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి (07252) నాలుగు రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు జన గాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూర్, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగి స్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి బెంగళూరు కు కొత్తగా ప్రారంభం కానున్న వందేభారత్ రైలు తిరుపతి మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలు ద్వారా విజయవాడ నుంచి తిరుపతికి నాలుగున్నార గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది.












Click it and Unblock the Notifications