Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 10 తేదీ వరకు పలు రైళ్లు రద్దు.. టికెట్ బుక్ చేసుకుంటే రిఫండ్..
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. 20 దూరప్రాంతాల రైళ్లతో పాటు హైదరాబాద్ లో నడిచే 16 ఎంఎంటీఎస్ రైళ్లను నేటి నుంచి 11 తేదీ వరకు రద్దు చేశారు. ఇందుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ప్రకటన విడుదల చేశారు.
కాజీపేట, డోర్నకల్, విజయవాడ, భద్రాచలం రోడ్ , సిర్పూర్ టౌన్, బల్లార్షా, సికింద్రాబాద్, వరంగల్,హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రద్దు చేసిన రైళ్లన్ని బిజీ మార్గాలు కావు.
ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కోరారు. నగరంలో వివిధ స్టేషన్ల మధ్య నడిచే 16 ఎంఎంఎటీఎస్ రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. లింగంపల్లి- హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 4 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్నుమా, ఫలక్నుమా- లింగంపల్లి మధ్య 1 సర్వీసు, ఉందానగర్- లింగంపల్లి మధ్య, లింగంపల్లి- ఉందానగర్ మధ్య 2 సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 2 సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో వివరించారు. ఈనెల 10 వరకు రద్దు కొనసాగుతుందని, ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు చూసుకోవాలని కోరారు.

కొన్ని రద్దీ మార్గల్లో ప్రయాణించే రైళ్లను కూడా రద్దు చేశారు. ఏపీలోని అనకాపల్లి- తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనుల కారణంగా ఈ నెల 3 నుంచి 10 తేదీల మధ్య పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విశాఖ- లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ , విజయవాడ- విశాఖ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ , గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేశారు.
విశాఖ-తిరుపతి మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలును కూడా విశాఖ-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారి టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దవడంతో పాటు డబ్బులు రిఫండ్ అవుతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications