బాలు ఆరోగ్యంపై తాజా బులిటెన్ - విషమంగానే ఉందన్న డాక్టర్లు - సామూహిక ప్రార్థనలు
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు బుధవారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు.
'కరోనాతో ఎంజీఎం హెల్త్ కేర్ లో చేరిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. నిపుణులైన మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది' అని బులెటిన్ లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి. ఆయన కోలుకున్నారంటూ కూతురు పల్లవి పేరుతో కొన్ని వార్తలు రాగా, ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ కొడుకు చరణ్ అన్నారు. ఇదిలా ఉంటే,

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొందరగా కోలుకోవాలని హైదరాబాద్ శివారు చిలుకూరు బాలాజీ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. చిలుకూరు బాలాజీకి బాలు ప్రియమైన భక్తుడని, ఆయన కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థన చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీడియాకు తెలిపారు. మరోవైపు..
బాలు కోసం సామూహిక ప్రార్థనలు చేసేందుకు సినీ రంగం సిద్దమైంది. చెన్నై వేదికగా గురువారం సాయత్రం 6:00 గంటల నుంచి 6:05 నిమిషాల వరకు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఈ క్యాక్రమానికి ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, భారతీరాజా, కమల్ హాసన్ తదితరురు నేరుగా హాజరవుతారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు, బాలు అభిమానులు కూడా తాము ఉన్నచోటే ఐదు నిమిషాల పాటు ప్రార్థనలు చేయాల్సిందిగా సినీ దిగ్గజాలు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications