చారిత్రక ప్రదేశాలు వీక్షించేందుకు ప్రత్యేక బస్సులు.!టూరిస్టులకు అద్భుతమైన అవకాశమన్న టీఆస్ ఆర్టీసీ ఛైర్మన్.!

హైదరాబాద్: హైదరాబాద్ అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ "హైదరాబాద్ దర్శిని" పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించారు. పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఆర్టీసీ సంస్థ నేరుగా పర్యటక మరియు చారిత్రక ప్రదేశాల వద్దకు బస్సు సర్వీసులను నడపడం సంతోషంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. హైదరాబాద్ నగర టూరిస్టులకు అణువుగా ఆర్టీసీ "హైదరాబాద్ దర్శిని" బస్సు సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. హైదరాబాద్ నగర పర్యటక ప్రదేశాలను చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు..

 ప్రయాణికుల సౌకర్యం కోసం మరో నూతన పథకం..

ప్రయాణికుల సౌకర్యం కోసం మరో నూతన పథకం..

చారిత్రక ప్రదేశాల బస్సు సర్వీసులు శనివారం మరియు ఆదివారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతాయని బాజిరెడ్డి గోవర్ధన్ స్పస్టం చేసారు. ఈ ప్యాకేజీలకు ఆదరణ పెరిగితే మిగతా రోజుల్లో కూడా విస్తరిస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టిఎస్ ఆర్టిసి సంస్థను ప్రజలందరూ ఆదరించాలని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేసారు.

 హైదరాబాద్ దర్శిని సిటీ టూర్ ఇదే..

హైదరాబాద్ దర్శిని సిటీ టూర్ ఇదే..

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బిర్లా మందిర్ దేవస్థానం దర్శనం. సమయం 9:00 గంటల నుండి 10:00. చౌల్ మహల్ ప్యాలెస్ సందర్శన. సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. పర్యాటక ప్రదేశమైన తారామతి బారదరి రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం. సమయం 13:00 నుండి 13:45 వరకు.

గోల్కొండ కోట సందర్శన సమయం 14:00 నుండి 15:30 వరకు. దుర్గం చెరువు పార్క్ సందర్శనం సమయం 16:00 నుండి 17:00 వరకు. కేబుల్ బ్రిడ్జ్ సందర్శనం సమయం 17:30 నుండి 18:00 వరకు. హుస్సేన్ సాగర్ మరియు ఎన్టీఆర్ పార్క్ సందర్శన 18:30 నుండి 19:30 వరకు ఉంటుందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

భోజన ఖర్చు ప్రయాణికులదే..

భోజన ఖర్చు ప్రయాణికులదే..

పర్యటక మరియు చారిత్రక ప్రాంతాలను వీక్షించిన అనంతరం తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు రాత్రి 20.00 చేర్చడం జరుగుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అల్పాహారం మరియు భోజన ఖర్చు ప్రయాణికులదే దీనిలో 10% డిస్కౌంట్ ఉంటుందని ఆయన తెలిపారు. టిఎస్ ఆర్టిసి మెట్రో ఎక్స్ప్రెస్ లో పెద్దలకు 250 రూపాయలు, పిల్లలకు 130 రూపాయలుగా ధరలను నిర్దారించినట్టు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ ఏసీ ఐతే పెద్దలకు 450 రూపాయలు,
పిల్లలకు 340 రూపాయలు గా నిర్దారించారు.

 కళాశాలల విద్యార్థులకు అద్బుతమైన అవకాశం..

కళాశాలల విద్యార్థులకు అద్బుతమైన అవకాశం..

ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడానికి టిఎస్ ఆర్టిసి వెబ్సైట్ను www.tsrtconline.in సందర్శించాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు, పాఠశాల విద్యార్థులు, మరియు ప్రకృతి ప్రేమికులు విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు విజ్ఞప్తి చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+