మహిళా రక్షణకు విశేష కృషి.!స్నేహపూర్వక వ్యవస్థతో అనూహ్య మార్పులన్న మేయర్ విజయ లక్ష్మి.!

హైదరాబాద్: మహిళలు, బాలికల రక్షణ కోసం షీ టీం చేస్తున్న కృషి అభినందనీయమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్ష దినోత్సవం పురస్కరించుకొని ఎంజే మార్కెట్ ఆవరణలో షీ టీం ద్వారా ఏర్పాటు చేసిన వేడుకలలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇప్పటికే షీ టీం భరోసా కేంద్రాల సేవల పట్ల అనేక మంది మహిళలు సంతృప్తితో ఉన్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేసారు. న్యాయం జరుగుతుందని నమ్మకంతోనే మహిళలు మహిళా పోలీస్ స్టేషన్లను సంప్రదిస్తున్నారని అన్నారు.

Special efforts for women protection. -Mayor Vijaya Lakshmi

అంతే కాకుండా అనేకమంది మహిళలు తనతో స్వయంగా సంప్రదించి పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను గురించి తెలియజేస్తున్నారని మేయర్ తెలిపారు. ఇంకా మహిళలకు రక్షణ భద్రత కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాల్సిన అమవసరం ఉందన్నారు మేయర్ విజయలక్ష్మి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళల సంక్షేమం పట్ల దూర దృష్టితో ఆలోచించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హోం మంత్రి మహమూద్ అలీ, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవితతో పాటు డిజిపి అంజనీ కుమార్, షికా గోయల్, ఇతర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+