దయనీయ స్థితిలో శ్రీతేజ్, ఒంటినిండా ట్యూబులు..నిశ్చేష్టంగా - అల్లు హామీ పైనే ఆశలు..!?
శ్రీతేజ్. ఈ చిన్నారి పరిస్థితి పై అందరూ చలించారు. పుష్ప-2 సినిమా తొక్కిసలాట జరిగి ఏడాది అయింది. ఈ పదేళ్ల శ్రీతేజ్‌ఆ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయ పడిన శ్రీతేజ్ ఇప్పటికీ తన తల్లి ఇక లేదన్న సంగతి తెలియక మంచంమీద నిశ్చేష్టంగా.. ఒంటి నిండా ట్యూబులతో రోజులు నెట్టుకొస్తున్నాడు. తండ్రి ఉద్యోగం మానేసి సపర్యలు చేస్తున్నారు. నాడు అల్లు ఫ్యామిలీ డిపాజిట్ చేసిని మొత్తం పైన వస్తున్న వడ్డీ చికిత్స ఖర్చుకు సరిపోవటం లేదు. కోలుకొనే వారకు ఆదుకుంటామని చెప్పిన అల్లు హామీ పైనే ఇప్పుడు శ్రీతేజ్ తండ్రి ఆశలు పెట్టుకున్నారు.
పుష్ప-2 విడుదల సమయంలో ప్రమాదం జరిగి ఏడాది అవుతోంది. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి సుదీర్ఘకాలం చికిత్స పొందిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి ఆరు నెలల కిందట డిశ్చార్జి అయ్యాడు కానీ, ఇంకా కోలుకోలేదు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్సాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాసకూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటినిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. శ్రీతేజ్ ఆకలి అని సైగ కూడా చేయలేడు. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70 శాతం దెబ్బతినడమే ఇందుకు కారణం.

రోజూ సికింద్రాబాద్‌లోని ఆసియా ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో కొన్ని నెలలుగా స్వాలో (మింగడం), స్పీచ్(మాట్లాడటం) థెరపీ ఇప్పిస్తున్నారు. అక్కడే అడ్మిట్ చేస్తే నెలకు రూ.90 వేలకు పైగా ఫీజు చెల్లించాలి. దీంతో.. తండ్రి అన్ని సపర్యలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రోజూ క్యాబ్‌లో బాబును తీసుకొచ్చి థెరపీలు ఇప్పిస్తున్నారు. రోజుకు రూ.2 వేల చొప్పున థెరపీలకే రూ.60వేలకు పైన కడుతున్నారు. ఇక ఇంటి దగ్గర కూడా కాళ్లు, చేతుల కదలికలకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు అదీ రూ.30 వేలవరకు అవుతుంది. ప్రతి నెలా కేవలం థెరపీలకే తక్కువలో తక్కువ రూ.90 వేలు కడుతున్నారు. శ్రీతేజ్ కు నిరంతరం డైపర్లు మారుస్తుండాలి. నిత్యం వేడినీళ్లతో ఒళ్లు తుడిచి దుస్తులు వేయాలి. శ్రీతేజ్‌కు థెరపీలు, ఇతర మందులు, డైపర్లు, ప్రత్యేకమైన ఆహారం వంటివన్నీ కలిపి నెలకు రూ.1.25 లక్షలు పైన ఖర్చు అవుతుంది.
కాగా, తొక్కిసలాటలో తన భార్య చనిపోవడంతో.. జరగరాని నష్టం జరిగిందంటూ అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరుమీద రూ.2 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ.. ఆ వడ్డీ డబ్బులు.. బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవడంలేదని అన్నారు. శ్రీతేజ్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో.. అతడు పూర్తిగా కోలుకునే దాకా తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భర్తిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయమై అల్లు అర్జున్‌కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్ కాంతారావును సంప్రదించగా.. సానుకూల స్పందన రాలేదని తెలిపారు. కనీసం బాబు థెరపీల ఖర్చు వరకైనా సాయం చేయాలని భాస్కర్ కోరుతున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications