గంజాయి కేసు: ఘాటుగా స్పందించిన శ్రీధర్ బాబు, కేసీఆర్‌పై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తనను గంజాయి కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు యత్నిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం తెరాస పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై మాజీ మంత్రి స్పందించారు.

ఇంట్లో గంజాయి పెట్టించి: కిషన్ రెడ్డి ఫిర్యాదు, శ్రీధర్ బాబుపై కేసు నమోదు

తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కాంగ్రెస్ నేతలను కేసీఆర్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయిస్తోందన్నారు.

Former Minister Sridha Babu clarified on allegations on him.

భూనిర్వాసితులకు అండగా ఉన్నామన్ని కక్షతోనే తమపై కేసులు పెట్టిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం విపక్షాలను కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కాగా, శ్రీధర్ బాబుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన అనుచరులు సుదర్శన్, భార్గవ్, నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Minister Sridha Babu clarified on allegations on him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి