తెరాస ఎమ్మెల్యే మధుకు శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్: ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..గ్యాంగ్స్టర్ నయీంతో నాకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు.. నయీం కేసును సీబీఐకి అప్పగించేలా సీఎం కేసీఆర్ ను కోరాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా గ్యాంగ్స్టర్ నయీమ్తో శ్రీధర్బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్బాబు నయీమ్తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని పుట్ట మధు ఆరోపించారు.
-
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications