ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి అరెస్ట్: కార్మిక సంఘాల అత్యవసర సమావేశం: టెన్షన్..టెన్షన్..!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. ప్రభుత్వ సమ్మె వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కార్మిక సంఘాల నేతలు సైతం వెనుకడుగు వేయటం లేదు. తాజాగా సమ్మె మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు..ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాలు ఇందిరా పార్క్ వద్ద నిరహార దీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి.అక్కడ దీక్షలకు అనుమతి లేదని..ఆంక్షలు కొనసాగుతున్నాయని పోలీసులు ప్రకటించటంతో దీక్షకు కార్మిక సంఘాలు వాయిదా వేసుకున్నాయి.
దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కార్మిక సంఘాల అన్ని రాజకీయ పక్షాల నేతలను కోరారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించటంతో కార్మిక సంఘాల నేతలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం అవుతోంది. ఇందులో ప్రభుత్వ నిర్ణయం పైన తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

కార్మిక సంఘాల నేతల అరెస్ట్..
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. ప్రభుత్వ తీరును నిరిసిస్తూ అక్కడ నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గన్ పార్క్ వద్దకు తరలి వస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. గన్ పార్క్ వద్దకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.
ముందుగా నిర్ణయించిన నిరహార దీక్షను పోలీసులు అనుమతి నిరాకరించటంతో వాయిదా వేసుకున్న కార్మిక సంఘాల నేతలు గన్ పార్క్ కు చేరుకుంటున్నారు. అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డితో పాటుగా రాజిరెడ్డి కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు..కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం..
సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం కానుంది. ఇప్పటి వరకు సమ్మె జరుగుతున్న తీరుతో పాటుగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా పరిగణంచమంటూ సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరికల పైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి హెచ్చరికలు భయపడేది లేదని చెబుతున్న కార్మిక సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు.
టీఎస్ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రభుత్వ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటం..ఖచ్చితంగా ప్రయివేటు బస్సులను ప్రవేశ పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించటంతో ఈ సమావేశం ద్వారా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విషయంలో ఏరకంగా ముందుకు వెళ్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications