Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిర్యానీ ఆర్డర్ చేస్తే... ఎలుకలు, బొద్దింకలు..

బిర్యానీ అనగానే నోరూరే భాగ్యనగర వాసులకు ఈ వార్త వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనం ఇష్టంగా తినే ముద్ద వెనుక ఎంతటి 'కుళ్ళిన' నిజాలు దాగి ఉన్నాయో తెలిస్తే.. ఇకపై హోటల్ మెట్లు ఎక్కాలన్నా భయపడాల్సిందే. బంజారాహిల్స్ నడిబొడ్డున వెలుగుచూసిన ఈ షాకింగ్ ఉదంతం, ఫుడ్ లవర్స్ ఆరోగ్యాన్ని హోటల్ యజమానులు ఎలా తాకట్టు పెడుతున్నారో కళ్లకు కట్టింది.

ఆకలి వేస్తోంది.. అసలే ఆదివారం.. వెజ్ ఏం తిద్దాంలే అని.. నోరూరించే బిర్యానీ ఆర్డర్ ఇస్తే, ఇంటికి వచ్చిన బిర్యానీ ప్యాకెట్ విప్పగానే వాంతి వచ్చినంత పనైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, వేడివేడి ఆవిర్లతో రావాల్సిన ఆ బిర్యానీ నుంచి భరించలేనంత దుర్వాసన రావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. తీరా పరిశీలిస్తే అది కుళ్లిపోయినట్లు తేలింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు 'నరకం' బయటపడింది.

Stale Biryani Scam Exposed in Banjara Hills Rat Infestation and Rotten Food Found at Lucky Restaurant
Blinkit: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు!
Blinkit: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు!

కొండారెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్‌పై మెరుపు దాడి చేశారు. అక్కడ ఫ్రిడ్జ్ తెరిచిన పోలీసులకు ఫ్యూజులు ఎగిపోయే దృశ్యాలు కనిపించాయి. ఫ్రిడ్జ్‌లో వండిన బిర్యానీ ప్యాకెట్ల మధ్య ఎలుకలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కిచెన్ మొత్తం బొద్దింకలు, అపరిశుభ్రత, దుర్గంధంతో నిండిపోయి ఉంది. అసలు అది హోటలా లేక ఏదైనా మురికివాడలోని గోడౌనా అనే అనుమానం కలిగేలా ఆ ప్రాంగణం ఉందంటే అతిశయోక్తి కాదు.

మూడు రోజుల నాటి 'మురిగిపోయిన' మాస్టర్ ప్లాన్!

పోలీసుల విచారణలో యజమాని ఇర్ఫాన్ ఆడుతున్న ప్రమాదకరమైన గేమ్ బయటపడింది. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే భారీ మొత్తంలో బిర్యానీని వండించి, ప్యాకెట్లుగా మార్చి బంజారాహిల్స్ అవుట్‌లెట్‌కు తరలిస్తున్నాడు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వగానే.. ఆ కుళ్లిపోయిన ప్యాకెట్‌ను ఓవెన్‌లో పెట్టి వేడి చేసి, అప్పుడే వండినట్లుగా భ్రమింపజేస్తూ డెలివరీ చేస్తున్నట్లు తేలింది. ఫ్రిడ్జ్‌లో దాదాపు 80కి పైగా ఇలాంటి పాత బిర్యానీ ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు.

Viral Video: శ్మశానంలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ..
Viral Video: శ్మశానంలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ..

క్రిమినల్ కేసు.. హోటల్ సీజ్!

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యజమాని ఇర్ఫాన్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ హోటల్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కి, కుళ్లిపోయిన మాంసం, ఎలుకలు తిరిగిన ఆహారాన్ని సరఫరా చేసినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని పేరున్న ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, సామాన్యులు తినే ఆహారానికి గ్యారెంటీ ఎక్కడ? అని ఇప్పుడు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+