రాజాసింగ్ హద్దులు దాటావ్ ..రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన
తెలంగాణ బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత రాజాసింగ్ సడన్‌గా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.
ఈ ఘటనతో రాష్ట్ర బీజేపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే, రాజాసింగ్ రాజీనామా వ్యవహారంపై రాష్ట్ర పార్టీ అధిష్టానం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అంతేకాదు, రాజాసింగ్ చర్యలు క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్ట అని తీవ్రంగా మండిపడింది.

రాజాసింగ్ నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలిస్తే, స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని హితవు పలికింది. బీజేపీ నాయకులు, వ్యక్తుల కంటే కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తుందని గట్టిగా గుర్తుచేసింది. రాజాసింగ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఈ పరిణామం తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది.












Click it and Unblock the Notifications