టిఆర్ఎస్ ఎత్తుకు రేవంత్ రెడ్డి పైయెత్తు: ముందే రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎత్తుకు నోటుకు ఓటు కేసు నిందితుడైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పైయెత్తు వేసినట్లు కనిపిస్తున్నారు. తనను శాసనసభ నుంచి టిఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడానికి ముందే శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చర్చించిన తర్వాత తన రాజీనామాపై రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బెయిల్ రావడంతో ఊరట పొందిన రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే టిఆర్ఎస్ పట్టుదలను ఆయన ఆ విధంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

Strategy: Revanth Reddy may quit MLA post

కేసు నడుస్తున్నంత కాలం మాట్లాడడానికి ఆయనకు పెద్దగా అవకాశం ఉండదు. రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరుగుతుంది. కాబట్టి తిరిగి కొడంగల్ నుంచి పోటీ చేసి ప్రజా మద్దతు ఉందనిపించుకుని శాసనసభలో అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో తనకు ప్రజా మద్దతు ఉందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. టిఆర్ఎస్‌పై నిరంతరం పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నిక కావడం ద్వారా నైతిక బలాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+