Street Dogs: ఆగని వీధి కుక్కల దాడులు.. భయపడుతున్న ప్రజల..
తెలంగాణలో వీధి కుక్కలు స్వైరవీరహారం చేస్తున్నాయి. కనిపించినోళ్లపై దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటికి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. తాజాగా కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
చోటూ బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. వరంగల్ లో వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో హన్మకొండలోని రెడ్డి కాలనీలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఏకంగా 28 మందిని తీవ్రంగా గాయపరిచింది.

తాజాగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. గాయపడ్డ వారిలో కొందరు మహిళలు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. కుక్క కాటుకు గురైన వారందరికి చికిత్స కోసం మరిపెడ పీహెచ్ సీకి తీసుకెళ్లారు. నెల రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
నర్సాపూర్ కాజీగల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కరిచాయి. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందతున్నారు. వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు. జీహెచ్ ఎంసీలో వీధి కుక్కలను నియంత్రించాలని వందల్లో ఫిర్యాదులు వచ్చాయి.












Click it and Unblock the Notifications