వారికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఐపీఎస్ సజ్జనార్ ఈజ్ బ్యాక్!

వీసీ సజ్జనార్... పోలీస్ అధికారిగా ఆయన మార్క్ గురించి వేరే చెప్పనవసరం లేదు. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలతో విసి సజ్జనార్ కొంతకాలం పాటు టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా పని చేశారు. అక్కడ కూడా ఆయన తన మార్క్ పాలన చూపించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి సజ్జనార్ గట్టి హెచ్చరికలు
తాజాగా ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా తిరిగి నియమించడంతో సుదీర్ఘ విరామం తర్వాత పోలీస్ యూనిఫామ్ ధరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ శాంతిభద్రతల పరిరక్షణలో తన మార్క్ చూపించబోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Strong warning to drunk and drive hyderabad cp IPS Sajjanar is back

అలా చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందేనన్న సజ్జనార్
తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉక్కుపాదం మోపుతామని, రూల్స్ ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమే మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాలను విధించుకోవద్దు.

మద్యం తాగి వాహనం నడపకండి.. సజ్జనార్ ట్వీట్
డ్రంక్ అండ్ డ్రైవ్ మీతో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుంది. థింక్ బిఫోర్ యు డ్రింక్ అండ్ డ్రైవ్.. గుర్తుపెట్టుకోండి మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు, బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వారికి సీపీ సజ్జనార్ వార్నింగ్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కారణంగా యువత చెడు దారులు పడుతున్నారని, బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లలో పాల్గొనే విఐపిలు తమ నిర్ణయాలను పునరాలోచించుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక సైబర్ నేరాల పైన ప్రజలు జాగ్రత్త వహించాలని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే మోసాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారులపైన వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
హైదరాబాద్ ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని గతంలోనే వెల్లడించిన ఆయన, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, కల్తీ ఆహారం పై ప్రత్యేక దృష్టి సారించడానికి టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని రోడ్డు టెర్రరిస్టులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపైన వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+