దేశమే ముఖ్యం: ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్‌పై కేటీఆర్, చంద్రబాబు స్పందన
హైదరాబాద్: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం దాడుల పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ సర్జికల్ స్ట్రయిక్స్ పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాల పైన దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశమే ముఖ్యమని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతును ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

భారత సైన్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అభినందించారు. అలాగే, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డిలు భారత సైన్యాన్ని అభినందించారు. పాక్‌కు ఇదే తగిన శాస్తి అన్నారు.












Click it and Unblock the Notifications