తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్
హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్ పల్లిలో జరిగిన ఈ దాడితో రోడ్డుపై ఉన్న జనం భయంతో పరుగులు తీశారు.

ఒక్కసారిగా కర్రలతో రోడ్డుపైకి ..
శనివారం మధ్యాహ్నం కూకట్ పల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు పరుగెత్తుతూ వచ్చారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. సిటీలోని బిజెనెస్ స్కూల్ లో చదువుతోన్న విద్యార్థులు .. ఓ హోటళ్లో పార్టీ చేసుకున్నారు. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. వీరి దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మహిళకు గాయం ..
అటువైపు వెళ్తున్న మహిళ తలకు గాయమైంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రహదారిపై బీభత్సం సృష్టించిన విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications