Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భారీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టించారు.

పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్ పూర్తవకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వాయిదాపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు చెబుతున్నారు.

Students protest at Osmania University demanding postponement of PG semester exams

కాకతీయ వర్సిటీలో జూనియర్లు, సీనియర్ల ఘర్షణ

కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు గౌరవం ఇవ్వడం లేదంటూ జూనియర్ విద్యార్థులతో సీనియర్లు గొడవకు దిగడంతో వివాదం మొదలైంది. ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటూ సెకండియర్ విద్యార్థులు శుక్రవారం మధ్యామ్నం లంచ్ సమయంలో వారిని గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో జూనియర్లంతా ఏకమై సీనియర్లపై గొడవకు దిగారు.

ఆ తర్వాత అన్నం తినే ప్లేట్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో క్యాంటీన్ పరిసరాలు రణరంగంగా మారాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు.. యూనివర్సిటీకి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. గొడవపై విచారణ జరిపి.. ఘర్షణకు కారణమైన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+