సీఎం క్యాంఫ్ ఆఫీస్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం విఫలమైంది. క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్ధి నేతలను అరెస్టు చేసిన బలవంతంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్పోరేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, తక్షణమే కేజీ టు పీజీ పథకాన్ని అమలు చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జూనియర్ కళాశాలల బంద్‌కు ఎన్ఎస్‌యూఐ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే విద్యార్ధి సంఘాలు క్యాంప్ కార్యాలయానికి ముట్టడికి యత్నించారు.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని, అనుమతి లేని కాలేజీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో శనివారం
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చేసుకుంది.
మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ కలెక్టరేట్ల ఎదుట వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications