16 ఏళ్లకే క్యాన్సర్.. చావు చివరి వరకూ వెళ్లి.. కన్నీళ్లు తెప్పించే ప్రపంచ సుందరి జర్నీ..!
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్ లాండ్ సుందరి సుచాత చువాంగ్ శ్రీ చరిత్ర సృష్టించారు. మిస్ వరల్డ్-2025 కిరీటాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. సుచాతా చువాంగ్ శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్ లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వాళ్లందరినీ అధిగమించి ప్రపంచ సుందరిగా నిలిచారు సుచాత చువాంగ్. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఆమె ఘనత సాధించడానికి ముందు ఎన్నో కష్టాలను అనుభవించారు. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డారు. రొమ్ములో కణతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. క్యాన్సర్ బారిన పడ్డట్లుగా భావించి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆమె మరణం అంచు వరకూ వెళ్లి ఎట్టకేలకు కోలుకుంది. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సుచాత చువాంగ్. ఆమె అందాల పోటీల్లోకి రావడానికి ఇవే ప్రేరేపించాయని ఆమె అన్నారు.
ఇక సుచతా చువాంగ్ పూర్తి పేరు ఒపాల్ సుచతా చువాంగ్ శ్రీ . ఆమె 20, సెప్టెంబర్ 2003న థాయ్‌లాండ్ లో జన్మించారు. థానెట్, సుపాత్ర చువాంగ్ ర్సీ దంపతుల కుమార్తె సుచతా చువాంగ్. ప్రస్తుతం సుచతా చువాంగ్ థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదువుతోంది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్ లాండ్ 2024 కిరీటాన్ని ఆమె సొంతం చేసుకుంది. తాజాగా ప్రపంచ సుందరి విజేతగా సంచలనం సృష్టించారు సుచతా చువాంగ్. దీంతో మిస్ వరల్డ్ గా నిలిచిన తొలి థాయ్‌లాండ్ మహిళగా రికార్డ్ సృష్టించారు.

ఈ ఫైనల్ పోటీలకు సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కరీనా జడ్జిలుగా ఉన్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్ గా మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఉన్నారు. ఇక మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ లో రానా దగ్గుబాటి,జయేశ్ రంజన్ కూడా ఉండటం విశేషం. ఇక సోనూసూద్ కు మిస్ వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూసూద్ కు అందించారు.
The crowning of Miss World 2025#MissWorld2025 #MissWorldThailand2025 pic.twitter.com/N0M2CpKL6w
— Basquiat-Plath (@m_kobene) May 31, 2025
మిస్ వరల్డ్-2025 పోటీలు హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ముగిశాయి. ఫైనల్స్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications