వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూక‌ట్ ప‌ల్లిలో పోటీ చేసేందుకు సుహాసినికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కుటుంబం..! రేపే నామినేష‌న్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: వివాదాలు స‌ర్థుమనిగాయి. కూక‌ట్ ప‌ల్లి అంశంలో కుటుంబ స‌భ్యులు మొత్తం ఏకాభిప్ర‌యానికి వ‌చ్చారు. ఎట్టకేలకు కూకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సై అంటున్నారు. బుధవారం రాత్రే సుహాసిని తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న చంద్రబాబును కలవడానికి గురువారం ఉదయమే సుహాసిని ఆమె స్నేహితురాలు కలసి విశాఖ బయలు దేరారు. అక్కడ చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుని రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి సుహాసిని నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

 కూక‌ట్ ప‌ల్లి లో పోటీకి కుటుంబ స‌భ్యుల అంగీకారం..! హ‌రిక్రిష్ణ కూతురు సుహాసిని పోటీకి పై..!!

కూక‌ట్ ప‌ల్లి లో పోటీకి కుటుంబ స‌భ్యుల అంగీకారం..! హ‌రిక్రిష్ణ కూతురు సుహాసిని పోటీకి పై..!!

వాస్తవానికి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి హరికృష్ణ కుమారు నందమూరి కళ్యాణ్ రామ్ ని పోటీలోకి దింపాలని చంద్రబాబు నాయుడు భావించారు. అయితే తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న కళ్యాణ్ రామ్ తనకు రాజకీయాల పట్ల్ ఆసక్తి లేదని... తానింకా పది, పదిహేనేళ్లు సినీపరిశ్రమలోనే కొనసాగాలనుకుంటున్నట్లు చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఇదంతా జరిగి దాదాపు నెల రోజులు గడచి పోయింది.

ఎంటీఆర్ వార‌సురాలిగా అరంగేట్రం..! సుహాసిని గెలుస్తుందంటున్న శ్రేణులు..!!

ఎంటీఆర్ వార‌సురాలిగా అరంగేట్రం..! సుహాసిని గెలుస్తుందంటున్న శ్రేణులు..!!

అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో హరికృష్ణ కుటుంబాన్ని పూర్తిగా టీడీపీకి దూరం చేసుకునే పరిస్ధితి లేదు. పైగా తెలంగాణ ప్రజలలో సైతం హరికృష్ణ పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ఆయన మృతి సందర్భంగా వచ్చిన అశేష జనవాహిన్ని బట్టి అర్ధమయ్యింది. దీంతో ఎలాగైనా నందమూరి కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావించిన చంద్రబాబు హరికృష్ణ కుమార్తె సుహసినిని పోటీ చెయ్యమని ఆహ్వానించారు. అయితే తొలుత ఈ ప్రతిపాదనను కూడా హరికృష్ణ కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. ముఖ్యంగా హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీరామారావులిద్దరూ పోటీ చేయవద్దని సోదరికి సూచించారు.

 ఎంటీఆర్ వార‌సులు రాజ‌కీయాల్లో ఉండాలి..! అందుకే సుహాసినిని ప్రోత్స‌హిస్తున్న టీడిపి..!!

ఎంటీఆర్ వార‌సులు రాజ‌కీయాల్లో ఉండాలి..! అందుకే సుహాసినిని ప్రోత్స‌హిస్తున్న టీడిపి..!!

అయితే గతంలో చంద్రబాబు సుహాసినికి ఉన్న కొన్ని బ్యాంకు రుణాలను సర్ధుబాటు చేసినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుహాసిని పెద్ద సోదరుడు జానికిరామ్ వ్యాపార అవసరాల కోసం సుహాసిని తన అస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అవసరం తీర్చారు. అయితే బ్యాంకు రుణాలు తీర్చడంతో విఫలమవ్వడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. ఆ సందర్భంగా చంద్రబాబు స్వ‌యంగా జోక్యం చేసుకుని సుహాసినిని అప్పుల ఊబి నుంచి బయటపడేశారు.

మొద‌ట ఒద్ద‌న్నా త‌ర్వాత ఒప్పుకున్న నంద‌మూరి కుటుంబం..! పోటీ ఏక‌గ్రీవ‌మే అంటున్న క్యాడ‌ర్..!!

మొద‌ట ఒద్ద‌న్నా త‌ర్వాత ఒప్పుకున్న నంద‌మూరి కుటుంబం..! పోటీ ఏక‌గ్రీవ‌మే అంటున్న క్యాడ‌ర్..!!


ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు చంద్రబాబు అడిగిన వెంటనే కూకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి సుహాసిని ఒప్పుకున్నట్లు చెపతున్నారు. ముఖ్యంగా సుహాసిని ప్రాణ స్నేహితురాలు కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు మోటివేట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఒక నేత సోదరే సుహాని ప్రాణ స్నేహితురాలు. కుటుంబ సభ్యులు కాదన్నా సుహాసిని ఎనికల్లో పోటీ చేయడానికి ఒప్పుకోవడానికి ఆ స్నేహితురాలే కారణమని సమాచారం.

English summary
Controversies are solved. The family members of the Kukat Palli come to the whole consensus. Suhasini daughter of Nandamuri Hrishrishna, says she is ready to contest from the assembly seat of Kukat Palli. On Wednesday informed Suhasini of her approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X